ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఆరోపణలు వచ్చిన మిగతా మంత్రులు, ఎమ్మెల్యేల భూకబ్జాలపై కూడా సమగ్ర విచారణకు ఆదేశించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సంచలన కేసులనే తప్పుదోవ పట్టించిన తెరాస సర్కార్... ఈటల మీద మాత్రమే ఆగమేఘాలపై ఎందుకు విచారణ చేపట్టారో చెప్పాలన్నారు.
'మిగతా మంత్రుల భూకబ్జాలపై కూడా సమగ్ర విచారణకు ఆదేశించాలి'
మంత్రి ఈటల రాజేందర్‌పై అంశంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఎన్నో అక్రమాలను పక్కదోవ పట్టించిన తెరాస ప్రభుత్వం... ఇలాంటి విపత్కర సమయంలో ఈటల అంశం తెరమీదకు ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్... కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆరోపించారు.
bandi sanjay responded on minister etela land dispute issue
కరోనా విపత్కర సమయంలో ప్రభుత్వం వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ కొత్త డ్రామాకు తెరతీశారని బండి ఆరోపించారు. కరోనా కేసులు, మరణాలు, వ్యాక్సిన్ కొరత లాంటి అంశాలపై ఇప్పటి వరకు నోరు మెదపని కేసీఆర్... ఉన్నట్టుండి ఈ అంశాన్ని తెరకు మీదకు తీసుకురావటం వెనుక ఆంతర్యమేంటో జనాలకు అర్థమవుతోందన్నారు. తెరాస పార్టీ అక్రమాలపై విచారణ చేపట్టాలంటే పక్క రాష్ట్రం నుంచి కూడా అధికారులను తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుందని సంజయ్ ఎద్దేవా చేశారు.