దశలవారీగా మద్యం నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి సుచరిత తెలిపారు. గుంటూరులో మాట్లాడిన ఆమె.. మద్యం దుకాణాల తగ్గింపు, ధరలు పెంపుతో మద్య ప్రవాహాన్ని అదుపు చేస్తున్నామన్నారు. కరోనా నివారణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.
విశాఖ ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందని హోంమంత్రి తెలిపారు. ఘటనపై విచారణ జరుగుతోందన్నారు. కారకులైన వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అవసరమైతే కంపెనీని తరలించడానికి ప్రభుత్వం యోచిస్తోందన్నారు.