ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో 9,927 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,71,639కి చేరింది. కరోనాతో మరో 92 మంది మృతి చెందారు. వీరితో కలిపి ఏపీలో కరోనాతో ఇప్పటివరకు 3,460 మంది మృత్యువాత పడ్డారు. వైరస్ బారి నుంచి 2,78,247 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 89,932 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 64,351 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఆంధ్రాలో ఇప్పటివరకు 33.56 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
జిల్లాల వారీగా మృతులు...
చిత్తూరు జిల్లాలో 16, అనంతపురం జిల్లాలో 11, కడప, ప్రకాశం జిల్లాల్లో 10 మంది చొప్పున కరోనాతో మృతి చెందారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 8 మంది చొప్పున మరణించారు. గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఆరుగురు చొప్పున, కృష్ణా జిల్లాలో నలుగురు, విజయనగరం జిల్లాలో ఒకరు కరోనాతో మృతి చెందారు.
జిల్లాల వారీగా కేసులు...
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1353 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 967, నెల్లూరు జిల్లాలో 949, గుంటూరు జిల్లాలో 917, పశ్చిమగోదావరి జిల్లాలో 853, విశాఖ జిల్లాలో 846, కర్నూలు జిల్లాలో 781, ప్రకాశం జిల్లాలో 705, విజయనగరం జిల్లాలో 667, శ్రీకాకుళం జిల్లాలో 552, కడప జిల్లాలో 521, అనంతపురం జిల్లాలో 494, కృష్ణా జిల్లాలో 322 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇవీ చూడండి:టీకా ఉత్పత్తిపై భారత్తో రష్యా సంప్రదింపులు