తెలంగాణ

telangana

ETV Bharat / city

AP CM: మాస్క్‌ ధరించకపోతే రూ.100 జరిమానా కచ్చితంగా అమలు

ap curfew, ap cm jagan review
ఏపీలో కర్ఫ్యూ సడలింపు, ఏపీ సీఎం జగన్

By

Published : Jul 12, 2021, 1:23 PM IST

Updated : Jul 12, 2021, 2:27 PM IST

13:18 July 12

AP CM: మాస్క్‌ ధరించకపోతే రూ.100 జరిమానా కచ్చితంగా అమలు

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ పరిస్థితులపై ఆ రాష్ట్ర సీఎం జగన్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీలో కొవిడ్‌ వ్యాప్తి కట్టడిపై మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులతో జగన్ చర్చించారు. ఈ సందర్భంగా కర్ఫ్యూపై నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపు ఇచ్చారు. రాత్రి 9 గంటలకు దుకాణాలు మూసివేయాలని వైకాపా ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్‌ కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆ రాష్ట్ర సీఎం జగన్‌ పలు సూచనలు చేశారు.  

మాస్క్‌ ధరించకపోతే రూ.100 జరిమానా 

మాస్క్‌ ధరించకపోతే రూ.100 జరిమానా కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. దుకాణాల్లో సిబ్బంది, కొనుగోలుదారులకు మాస్కు తప్పనిసరి ఉండాలని సూచించారు. నిబంధన ఉల్లంఘిస్తే దుకాణాలకు భారీ జరిమానాలు విధించాలని... దుకాణాలు 2–3 రోజులు మూసివేయాలని  అధికారులకు ఆదేశాలిచ్చారు.  నిబంధనల ఉల్లంఘనపై ఫొటో తీసి పంపినా జరిమానాలు విధిస్తామన్నారు. ఫొటోలు పంపేందుకు ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ ఏర్పాటు చేయనున్నారు.

అందరూ మాస్క్‌ ధరించేలా మార్కెట్‌ కమిటీలు

ఏపీవ్యాప్తంగా 144 సెక్షన్‌ కఠినంగా అమలు చేయాలని అధికారులకు తెలిపారు. ప్రజలెవ్వరూ గుమిగూడకుండా కఠిన ఆంక్షలు విధించాలని..మార్కెట్లు, తదితర చోట్ల మాస్కులు ధరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.  అందరూ మాస్క్‌ ధరించేలా మార్కెట్‌ కమిటీలు చూడాలని సూచించారు.  

ఇదీ చదవండి:L.Ramana: కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరిన ఎల్.రమణ

Last Updated : Jul 12, 2021, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details