ఆంధ్రప్రదేశ్‌లోని కడప స్టీల్ ప్లాంట్‌పై ఆ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను ఎస్సార్ స్టీల్స్‌కు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వివరాలను వెల్లడించారు.
కడప స్టీల్ ప్లాంట్ ఎస్సార్ స్టీల్స్‌కు అప్పగింత
ఏపీలోని కడప స్టీల్ ప్లాంట్‌పై ఆ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను ఎస్సార్ స్టీల్స్‌కు అప్పగించాలని నిర్ణయించింది. గతంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను లిబర్టీ స్టీల్స్‌కు అప్పగించారు.
కడప స్టీల్ ప్లాంట్‌పై కీలక నిర్ణయం
కృష్ణపట్నం పోర్టులో మౌలిక వసతులకు రూ.1,448 కోట్లు మంజూరుకు ఆమోదముద్ర వేశామని తెలిపారు. కైలాసగిరి-భోగాపురం మధ్య 6 వరుసల రోడ్లతో పాటు 5 ఎకరాల్లో స్కై టవర్స్ నిర్మించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్టు చెప్పారు.
ఇదీ చదవండి:ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ టీకాలకు ప్రభుత్వం మళ్లీ అనుమతి