హై-ఫై మాస్కులతో కరోనా అంతమయ్యేనా?
కొవిడ్ మహమ్మారి కట్టడిలో మాస్కులది ప్రధాన పాత్ర. మాస్కులను సరిగ్గా వినియోగిస్తే వైరస్ నుంచి రక్షణ పొందొచ్చు. ఎలాంటి మాస్కులు వాడాలి..? హై-ఫై మాస్కులు అంటే ఏమిటీ..? వాటి సామర్ధ్యం ఎంత అనే అంశాల గురించి వైరస్ నిరోధక నిపుణుడు దేవభక్తుని శ్రీకృష్ణ ఏం చెబుతున్నారంటే..
ఎక్కడ చూసినా.. కరోనా విలయమే. మాటలకందని విషాదం. ఈ కష్టకాలంలో కరోనాను గెలిచేది ఎలా? ఈ పోరాటంలో హై-ఫై మాస్క్ అంటూ సరికొత్త ఆయుధాన్ని సూచిస్తున్నాడు.. ఓ తెలుగు నిపుణుడు. సాంకేతిక, ఐటీ సేవల నుంచి వైరస్‌ల భరతం పట్టే కీలక వ్యూహ రచనలోకి అడుగుడిన అనుభవంతో.. కీలక సూచనలు చేస్తున్నాడు. తనే.. దేవభక్తుని శ్రీ కృష్ణ. 2014 నుంచి... ఎబోలా మొదలు.. ఎన్నో మొండి వైరస్‌ల కోరలు పీకడంలో అవసరమైన నమూనాలు అందించారు శ్రీ కృష్ణ. అంటువ్యాధుల నియంత్రణపై అనేకమంది అంతర్జాతీయ నిపుణులతో కలసి పని చేశారు. పలు అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్‌లో ఆయన రచనలు ప్రచురణ అయ్యాయి. ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ కరోనా కట్టడి ఎలా... అనే అంశంపైనా తన ఆలోచనను ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా పంచుకుంటున్నారు. ఏ మాస్క్ మంచిది? డబుల్ మాస్క్‌తో ఉపయోగం ఎంత? రెండో దశ కరోనా అంతమయ్యేది ఎప్పుడో వైరస్ నిరోధక నిపుణులు దేవభక్తుని శ్రీ కృష్ణుడి మాటల్లోనే..
- ఇదీ చదవండి :తుంపర్ల ద్వారానే వైరస్ వ్యాప్తి అధికం!