Thief Stuck: ఈ వీడియోలో ఉన్న యువకుడిని చూశారా ? అతను ఏదో సర్కస్ చేస్తున్నాడని అనుకుంటున్నారా? లేదు.. గుడికి వచ్చి బయటకు వెళ్లేందుకు ఇలా ప్రయత్నించి ఇరుక్కుపోయాడు. అదేంటి గుడికి వెళ్లిన అతను మంచిగా ద్వారం నుంచి వెళ్లవచ్చుగా అనుకుంటున్నారా? అతను వచ్చింది దైవదర్శనానికి కాదు. దొంగతనం చేసేందుకు వచ్చాడు.
Thief Stuck: 'దొంగతనానికి వచ్చి... గోడ కన్నంలో ఇరుక్కుపోయి' - శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం
Thief Stuck: అనుకున్నది ఒక్కటి.. అయినది ఒకటి అన్నట్లు ఉంది ఆ దొంగ పరిస్థితి. దొంగతనానికి వచ్చిన ఆ దొంగ ఓ గోడ కన్నంలో ఇరుక్కుపోయాడు. చివరకు బయటికి వచ్చాడో? లేదో? తెలుసుకోవాలంటే ఇది చూడండి.
Thief Stuck
లోపలికి తేలికగానే వెళ్లిన అతను తిరిగి బయటకు వచ్చే క్రమంలో ఇలా ఇరుక్కుపోయాడు. అతనిని గమనించిన స్థానికులు పోలీసులకు పట్టించారు. ఇంతకి అతను ఎవరూ? ఇది ఎక్కడ జరిగిందనుకుంటున్నారా? అతని పేరు రీస్ పాపారావు, ఏపీ శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాడుపూడి గ్రామంలోని జామి ఎల్లమ్మ ఆలయంలో చోరీ చేసేందుకు వచ్చాడు.
ఇదీ చదవండి :ఎగురుకుంటూ టీ తోటలో పడిన నాగార్జున కారు.. తీరా చూస్తే..