తెలంగాణ

telangana

ETV Bharat / city

'కల్లు గీత కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్​ ఏర్పాటు చేయాలి' - Hyderabad_Somajiguda_Pressclub

కల్లు గీత కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, ఆరోగ్య బీమా అందించాలని గౌడ​ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు గౌడ్‌ డిమాండ్​ చేశారు. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Goud_Sangam
Goud_Sangam

By

Published : Feb 1, 2020, 10:43 PM IST

కల్లుగీత కార్మికులు తాటిచెట్టు ఎక్కేందుకు ఆధునిక యంత్రాలను ఇవ్వాలని గౌడ​ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు గౌడ్‌ కోరారు. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌తో కలిసి ఆయన మాట్లాడారు. కల్లుగీత కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

గీత కార్మికుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. తాటిచెట్టు ఎక్కి ప్రమాదానికి గురైన వారికి ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేయాలని... ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. గౌడ కులస్థులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక ఎదుగుతుంటే తెరాసలోని కొందరు నేతలు అణిచివేసేందుకు ప్రయత్నించడం బాధాకరమన్నారు.

మాట్లాడుతున్న గౌడ సంఘం నేత

ఇదీ చూడండి: బడ్జెట్​ సమావేశంలో మంత్రి నిర్మల కశ్మీరీ కవిత

ABOUT THE AUTHOR

...view details