తెలంగాణ

telangana

ETV Bharat / city

అక్రమ మద్యం కేసులో ఏ-1 నిందితుడిగా భాజపా నేత

తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్న నలుగురిని ఏపీలోని గుంటూరు ఎస్​ఈబీ అధికారులు అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 6 లక్షల విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్​ఈబీ అదనపు ఎస్పీ చెప్పారు. వీరిలో 2019లో మచిలీపట్నం భాజపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గుడివాక రామాంజనేయులు ఉన్నట్లు అధికారి పేర్కొన్నారు. రామాంజనేయులను పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తున్నట్లు భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.

6-lakh-rupees-telangana-liquor-caught-at-guntur-town-bty-seb-officers
అక్రమ మద్యం కేసులో ఏ-1 నిందితుడిగా భాజపా నేత

By

Published : Aug 16, 2020, 10:18 PM IST

తెలంగాణ మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను ఏపీ ఎస్​ఈబీ అధికారులు అరెస్ట్​ చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి గుంటూరుకు తరలిస్తుండగా గుంటూరు వద్ద ఏఈఎస్​ చంద్రశేఖర్​ రెడ్డి అధ్వర్యంలో పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 1920 మద్యం సీసాలను, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 6 లక్షలు ఉంటుందని ఎస్​ఈబీ అదనపు ఎస్పీ ఆరిఫ్​ హాజిఫ్​ తెలిపారు. నిందితులు రామాంజనేయులు, మచ్చా సురేశ్​, కె. నరేశ్​, గంటా హరీశ్​లుగా పోలీసులు గుర్తించారు.

వీరిలో ఏపీ భాజపా నేత గుడివాక రామాంజనేయులు అలియాస్​ అంజిబాబు ఎ-1 నిందితుడని అధికారి చెప్పారు. ఈయన 2019లో మచిలీపట్నం భాజపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు.

పార్టీ నుంచి సస్పెండ్​

తెలంగాణ నుంచి మద్యం తరలింపు కేసులో పట్టుబడిన నిందితుడు రామాంజనేయులు అలియాస్​ అంజిబాబును పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తున్నట్లు భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details