ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని ఉప్పరపల్లి హరిజనవాడకు చెందిన ఐదేళ్ల బాలుడు హర్షిత్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ...తల్లి శైలజ ఇంటి బయట కూర్చుని హర్షిత్‌కు అన్నం తినిపించింది. తరువాత బాలుడు మరుగుదొడ్డికి వెళ్లాడు. ఇంతలోనే ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగకు హర్షిత్ తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. కొడుకు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి ఆ తల్లి గుండెలు అవిసేలా రోదించింది.
లేరా నాన్నా.... లే... అంటూ ఏడ్చే ఆ అమ్మను ఎవరు ఓదార్చగలరు..!
తల్లిచేతిలో గోరుముద్దలు తిన్న కొడుకు అంతలోనే మృత్యువాతపడ్డాడు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని హరిజనవాడలో 5 ఏళ్ల హర్షిత్ విద్యుదాఘాతంతో మృతిచెందాడు.
లేరా నాన్నా.... లే... అంటూ ఏడ్చే ఆ అమ్మను ఎవరు ఓదార్చగలరు..!