రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,61,006కి చేరింది. వైరస్‌తో తాజాగా ఒకరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 3,892కు పెరిగింది. కొవిడ్ నుంచి మరో 338 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 6,51,763కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 5,351 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వారిలో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండగా మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇవాళ 51,004 మందికి కరోనా పరీక్షలు పరీక్షలు నిర్వహించారు.
Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు, ఒకరు మృతి
18:55 September 10
Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు, ఒకరు మృతి
ప్రభుత్వ పీహెచ్సీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 45,063 టెస్టులు నిర్వహించారు ఇందులో 21 ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఉండగా మిగతావి అంటిజెన్ పరీక్షలు ఉన్నాయి. ప్రైవేట్‌లో 5,941 పరీక్షలు చేశారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 98.6 శాతంగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 71 కేసులు నమోదయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లాలో 3, భద్రాద్రి కొత్తగూడెం 9, జగిత్యాల 6, జనగామ 3, కరీంనగర్ 11, ఖమ్మం 12, కుమురం భీం ఆసిఫాబాద్ 1, మహబూబ్‌నగర్ 4, మహబూబాబాద్ 2, మంచిర్యాల 4, మెదక్ 1, మేడ్చాల్ మల్కాజిగిరి 8, ములుగు 4, నాగర్ కర్నూల్ 1, నల్గొండ17, నిజామాబాద్ 1, పెద్దపల్లి 7, రాజన్న సిరిసిల్ల 3, రంగారెడ్డి 12, సంగారెడ్డి 2, సిద్దిపేట 6, సూర్యాపేట 7, వనపర్తి 1, వరంగల్ 9, హనుమకొండ 11, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 కేసులొచ్చాయి. జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్, వికారాబాద్ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
ఇదీ చదవండి:Rape On Child: అందరు అనుమానించిందే నిజమైంది.. చిన్నారిని వాడే చిదిమేశాడు..