ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో గతంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులనూ పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2015లో పలు దరఖాస్తులు వివిధ కారణాల వల్ల పరిష్కారం కాలేదు. తాజాగా మరోమారు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. పెండిగ్ దరఖాస్తులను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. పాత దరఖాస్తులను ప్రస్తుత ఎల్ఆర్ఎస్ విధివిధానాలకు అనుగుణంగానే పరిష్కరించాలని, అటువంటి వారి నుంచి కొత్తగా మళ్లీ దరఖాస్తులు స్వీకరించరాదని స్పష్టం చేశారు.
ఎల్ఆర్ఎస్: ఇప్పటి వరకు 12.76 లక్షల దరఖాస్తులు
ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు 12.76 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రామ పంచాయతీల నుంచి 5.19 లక్షలు, పురపాలక సంఘాల నుంచి 5.15 లక్షలు, నగరపాలక సంస్థల నుంచి 2.42 లక్షల దరఖాస్తులు నమోదయ్యాయి.
ఎల్ఆర్ఎస్: ఇప్పటి వరకు 12.76 లక్షల దరఖాస్తులు
పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులన్నింటినీ డిసెంబర్ నెలాఖరు వరకు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో ఇప్పటి వరకు 12.76 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రామ పంచాయతీల నుంచి 5.19 లక్షలు, పురపాలక సంఘాల నుంచి 5.15 లక్షలు, నగరపాలక సంస్థల నుంచి 2.42 లక్షల దరఖాస్తులు నమోదయ్యాయి.
ఇవీ చూడండి:గ్రామాల్లో ధరణికి డబుల్ ట్రబుల్.. తలలు పట్టుకుంటున్న అధికారులు