కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి చూడడానికి బాగున్నా.. వైద్య సేవలు నామమాత్రంగానే ఉన్నాయని జాతీయ మానవ హక్కుల కమిషన్ సహాయ రిజిస్టర్ ముఖేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రతి గదిని తిరిగి చూశారు. ఆస్పత్రిలోని వార్డులు, అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. రక్తనిధి కేంద్రం, శస్త్ర చికిత్సల గదిని పరిశీలించారు.
ఇలాగేనా ప్రజలకు వైద్యసేవలు అందించేది! - ఆసిఫాబాద్ జిల్లా వార్తలు
జాతీయ మానవ హక్కుల కమిషన్ సహాయ రిజిస్టార్ ముఖేష్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బ్లడ్ బ్యాంక్, ల్యాబ్, ఎక్సరే 24 గంటలు పనిచేయకపోవడంపై మండిపడ్డారు. వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాగేనా ప్రజలకు వైద్యసేవలు అందించేది!
బ్లడ్ బ్యాంక్, ల్యాబ్, ఎక్సరే 24 గంటలు పనిచేయకపోవడంపై మండిపడ్డారు. రాత్రివేళ ఒకే వైద్యురాలు విధుల్లో ఉంటే అత్యవసర కేసులు వస్తే పరిస్థతి ఏంటని ప్రశ్నించారు. క్యాజువాలిటీలో ఒక్క రోగి కూడా లేకపోవడం చూస్తే ఇక్కడి వైద్య సేవల తీరు ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులు, సమస్యలు, అవసరమైన పరికరాల విషయంలో సంబంధిత శాఖకు నివేదిస్తామని తెలిపారు.
ఇవీ చూడండి:ఆ ఆలోచన.. ఆదా చేసే.. ఆదాయం మిగిల్చే...