తెలంగాణ

telangana

ETV Bharat / business

గూగుల్​లో ఉద్యోగం కావాలా? అప్లికేషన్ ప్రాసెస్ ఇదే!

How To Get Job In Google : గూగుల్​ లాంటి అగ్ర సంస్థలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఎంపిక ప్రక్రియ ఏవిధంగా ఉంటుంది? ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలు మీ కోసం.

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 3:20 PM IST

How To Get Job In Google
How To Get Job In Google

How To Get Job In Google : ప్రపంచంలోనే ప్రముఖ దిగ్గజ సంస్థలైన గూగుల్​, మెటా లాంటి సంస్థల్లో పనిచేయాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి సంస్థలు ఇచ్చే భారీ వేతనాలు, కల్పించే ఇతర సౌకర్యాలే అందులో చేరేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపడానికి ముఖ్య కారణం. అయితే గూగుల్​లో జాబ్​సాధించడం అంత సులువేం కాదు.. అయినప్పటికీ ప్రయత్నిస్తే అసాధ్యమేమీ కాదు. గూగుల్​లో ఎలా ఉద్యోగం పొందవచ్చు? ఆ సంస్థలో ఉద్యోగాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి? గూగుల్​లో ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందో సవివరంగా తెలుసుకుందాం.

గూగుల్ సెర్చ్​టూల్​ ఆప్షన్​ ద్వారా
ముందుగా మీరు గూగుల్ కెరీర్​ సెర్చ్ ​టూల్​ ద్వారా ఫ్రొపైల్​ను తయారు చేయాల్సి ఉంటుంది. దీనిలో మీ పూర్తి వివరాలు, గత ఉద్యోగ అనుభవం, మీరు ఎక్కడ పనిచేయాలనుకుంటున్నారనే మొదలైన వివరాలు ఎంటర్ చేయండి.

గూగుల్​లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి?
మీరు మీ ఫ్రొపైల్​ను రూపొందించిన తరువాత గూగుల్​ కెరీర్ సెర్చ్​టూల్​ ద్వారా ఏఏ జాబ్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అందులో ఉండే ఫిల్టర్ ఆప్షన్ ద్వారా వివిధ లొకేషన్స్​లో ఏ ఉద్యోగాలు ఉన్నాయి. ఫుల్​టైం​ జాబ్స్​, పార్ట్​టైం జాబ్స్​, టెంపరరీ, ఇంటర్న్​షిప్ మొదలైన ఆఫ్షన్​లు ఉంటాయి. ఆయా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు, అర్హతలు సంస్థల ( Google, GFiber, Waymo, Verify life Sciences, Wing,X, Youtube) వివరాలు ఉంటాయి. మీకు తగిన ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి 30 రోజులకు మూడు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ ఏవిధంగా ఉంటుంది?
గూగుల్​లో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మిగతా సంస్థలు కన్నా కాస్త భిన్నంగా ఉంటుంది. ఎంపిక ప్రక్రియ ముఖ్యంగా నాలుగు అంచెల్లో ఉంటుంది. అవి అసెస్​మెంట్స్​, షార్ట్ వర్చువల్ చాట్స్, ప్రొజెక్ట్ వర్క్, ఇంటర్య్వూ. ఈనాలుగు ప్రక్రియలు ఏవిధంగా ఉంటాయో తెలుసుకుందాం.

  • అసెస్​మెంట్స్ : కోడింగ్ క్విజ్​ లాంటి ఆన్​లైన్ అసెస్​మెంట్లు ఉండవచ్చు. మీకు ఓ ఆన్​లైన్ ప్రొజెక్టు ఇచ్చి చెయ్యమని ఇంటర్య్యూ మెంబర్లు కోరే అవకాశం ఉంది.
  • షార్ట్ వర్చువల్ చాట్స్ : ఎంపిక చేసే మేనేజర్​ లేదంటే రిక్రూటింగ్ టీమ్​లోని మెంబర్లతో కూడిన షార్ట్ వర్చువల్ చాట్స్​ను గూగుల్ నిర్వహిస్తుంది. ఇది ఫోన్​ లేదా వీడియో మాధ్యమం ద్వారా జరుగుతుంది.
  • ప్రొజెక్ట్ వర్క్ : గూగుల్ ఇంటర్యూ ప్రక్రియలో భాగంగా కొన్నిసార్లు అభ్యర్థులను చిన్నచిన్న ప్రాజెక్టులను చేయమని అడగవచ్చు. ఇందులో బాగంగా కొంత సమాచారం ఇచ్చి కోడ్ షాంపిల్స్ రాయమని అడిగే అవకాశం ఉంది.
  • ఇంటర్య్వూ :పై మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు 3-4 ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీటిని పర్సనల్​గా లేదా ఫోన్​ద్వారా నిర్వహించచ్చు. ఈ ఇంటర్య్వూలో అభ్యర్థికి తగిన నైపుణ్యాలు ఉన్నాయా? అనే విషయాన్ని ఎంపిక చేసేవారు పరిశీలిస్తారు. గూగూల్ సంస్థ ఇంటర్య్వూలను రెండు ఫార్మాట్లలో నిర్వహిస్తుంది. అవి స్ట్రక్చరెడ్ ఇంటర్య్యూ, ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు.
  1. నిర్మాణాత్మక ఇంటర్వ్యూ: ప్రతి అభ్యర్థి స్పష్టమైన రూబ్రిక్‌లను ఉపయోగించి అంచనా వేస్తారు. ఉద్యోగం కోసం ఎంపిక చేయబోయే అభ్యర్థులందరికీ ఒకే విధానం ద్వారా వారి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు.
  2. ఓపెన్​ ఎండెండ్ ప్రశ్నలు :ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఓపెన్ ఎండెండ్ ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్యూ ప్యానెల్ సభ్యులు అభ్యర్థి మేధో సామర్థ్యాన్ని అంచనా వేయడానికి వివిధ ప్రశ్నలు అడుగుతారు. టీం మేనేజ్​మెంట్, మీకున్న నైపుణ్యాలు, సమస్యలను పరిష్కరించే విధానాన్ని పరిశీలిస్తారు. ఇంటర్య్వూ ప్రక్రియలో మీ వసతి సౌకర్యం అవసరమైతే గూగుల్​ సంస్థే ఆ ఏర్పాటు చేస్తుంది. మీ ఇంటర్య్యూలు పూర్తయిన తర్వాత, మీ వివరాలన్నింటిని సమీక్షించి మీరు ఎంపికయినట్లయితే జాబ్​ ఆఫర్ లెటర్​ను పంపిస్తుంది.

డిగ్రీ లేకున్నా ఉద్యోగాలు.. గూగుల్, IBMలోనూ ఛాన్స్.. విమానాలూ నడపొచ్చు!

'ఐటీకి పండగే.. వచ్చే మూడేళ్లు భారీ ఆర్డర్లు'

ABOUT THE AUTHOR

...view details