తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 1:41 PM IST

ETV Bharat / business

ఆపద సమయంలో సాయం అందించే - ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్ ఇవే!

All India Government Helpline Numbers In Telugu : ఆపదలు, ప్రమాదాలు చెప్పిరావు. ప్రకృతి విపత్తులను మనం నేరుగా ఎదుర్కోలేము. ఇలాంటి సందర్భాల్లో ప్రజలకు సాయం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెల్ప్​లైన్ నంబర్లను, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లను అందుబాటులో ఉంచాయి. అందుకే ఈ ఆర్టికల్​లో ఆపద సమయంలో ఉపయోగపడే ముఖ్యమైన హెల్ప్​లైన్ నంబర్ల గురించి తెలుసుకుందాం.

Emergency Contact Numbers in India
All India Government Helpline Numbers

All India Government Helpline Numbers : ఎప్పుడు ఎలాంటి విపత్తులు, ప్రమాదాలు సంభవిస్తాయో ఎవరూ ఊహించలేరు. అందుకే అత్యవసర సమయాల్లో మనకు ఉపయోగపడే హెల్ప్​లైన్ నంబర్లు గురించి, ఎమర్జెన్సీ కాంటాక్ట్​ నంబర్లు గురించి తెలుసుకోవడం చాలా మంచిది. దీని వల్ల ఆపద వచ్చినప్పుడు స్వయంగా మనకు, మన తోటివారికి తక్షణ సాయం లభిస్తుంది. అందుకే ఈ ఆర్టికల్​లో ఇండియన్ గవర్నమెంట్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన హెల్త్​లైన్ నంబర్లు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు గురించి తెలుసుకుందాం.

All India Helpline Numbers List :

  • నేషనల్ ఎమర్జెన్సీ నంబర్ - 112 (దీనిని పోలీస్​, ఫైర్​, అంబులెన్స్ సర్వీసుల కోసం ఉపయోగించవచ్చు.)
  • పోలీస్ కంట్రోల్ రూమ్​​ - 100
  • ఫైర్ కంట్రోల్​ రూమ్​ (అగ్ని ప్రమాదం) - 101
  • అంబులెన్స్ - 102
  • రైల్వే ఎంక్వైరీ - 131/135
  • రైల్వే యాక్సిడెంట్​ ఎమర్జెన్సీ సర్వీస్​ - 1072
  • రోడ్​ యాక్సిడెంట్​ ఎమర్జెన్సీ సర్వీస్ - 1073
  • రోడ్​ యాక్సిడెంట్​ ఎమర్జెన్సీ సర్వీస్ (నేషనల్​ హైవేలపై ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ ఆపరేటర్లను సంప్రదించడానికి) - 1033
  • సీనియర్ సిటిజెన్ ఎంక్వైరీ - 1091/1291
  • సెంట్రల్ విజిలెన్స్ కమిషన్​ - 1964
  • డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ సర్వీస్​ - 108
  • ఉమెన్ హెల్ప్​లైన్ - 1091
  • ఉమెన్ హెల్ప్​లైన్​ (గృహ హింస) - 181
  • ఎయిర్ అంబులెన్స్ - 9540161344
  • ఎయిడ్స్ హెల్ప్​లైన్ - 1097
  • డిజాస్టర్ మేనేజ్​మెంట్​ (NDMA) - 011-26701728-1078
  • భూకంపం/ వరదలు/ విపత్తు (NDRF) - 011-24363260
  • డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్​ (పిల్లలు, మహిళలు మిస్సింగ్​) - 1094
  • ORBO సెంటర్​, ఎయిమ్స్​ (అవయవ దానం), దిల్లీ - 1060
  • రిలీఫ్ కమిషనర్​ (ప్రకృతి వైపరీత్యాలు) - 1070
  • చిల్డ్రన్ ఇన్ డిఫికల్ట్ సిట్యువేషన్​ (క్లిష్ట పరిస్థిల్లో పిల్లలు ఉన్నప్పుడు) - 1098
  • టూరిస్ట్​ హెల్ప్​లైన్​ - 1363 లేదా 1800111363
  • ఎల్​పీజీ లీక్ హెల్ప్​లైన్​ - 1906
  • ట్రాఫిక్ హెల్ప్​ - 1073

Telangana Emergency Contact Numbers :

  • పోలీస్​ - 100
  • ఫైర్​ - 101
  • అంబులెన్స్ - 108
  • బ్లడ్ బ్యాంక్​ - 040-24745243

Andhra Pradesh Emergency Contact Numbers :

  • అంబులెన్స్ - 108
  • పోలీస్​ - 112
  • ఫైర్​ - 101
  • క్రైమ్ స్టాపర్ - 1090
  • క్రైమ్​ (మహిళలు, పిల్లలు) - 1091
  • ట్రాఫిక్ హెల్ప్​ - 1073
  • ఎలక్ట్రిసిటీ కంప్లైంట్​ - 155333
  • వాటర్​ సప్లై - 155313
  • రైల్వే ఎంక్వైరీ - 131/ 135
  • రైల్వే రిజర్వేషన్​ - 139
  • ఫ్రీ సర్వీస్ అంబులెన్స్ - 102
  • ఆరోగ్య శ్రీ - 104
  • ఓటర్ ఎన్​రోల్మెంట్​ -1950

సైబర్‌ మోసానికి గురయ్యారా? సింపుల్​గా కంప్లైంట్​ చేయండిలా!

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు గురించి తెలుసుకోవాలా? UDGAM పోర్టల్​లో చెక్ చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details