తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ, బ్యాంకింగ్​ షేర్ల జోరు- 50వేల వద్ద సెన్సెక్స్ - మార్కెట్​ అప్​డేట్స్

The Indian stock market opened in the green following positive global cues
ఐటీ షేర్ల జోరు- లాభాల్లోకి మార్కెట్లు

By

Published : Mar 23, 2021, 9:26 AM IST

Updated : Mar 23, 2021, 2:18 PM IST

14:11 March 23

కొనసాగుతున్న బ్యాంకింగ్​ షేర్ల జోరు- లాభాల్లో మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 270 పాయింట్లకుపైగా పెరిగింది. ప్రస్తుతం 50 వేలకు ఎగువన ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో 14 వేల 814 వద్ద కొనసాగుతోంది. 

అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ పరిస్థితులు, కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళనలు ఉన్నా... ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బలోపేతం లాభాలకు కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

టైటాన్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, రిలయన్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎస్​బీఐ, ఇన్ఫోసిస్​​, హెచ్​సీఎల్​ టెక్​, మారుతి, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​,టీసీఎస్​, షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఎన్​టీపీసీ,ఓఎన్​జీసీ,  కోటక్ మహేంద్ర బ్యాంక్​, పవర్​ గ్రిడ్​, హెచ్​డీఎఫ్​సీ, సన్​ఫార్మా, బజాజ్​ ఫినాన్స్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

13:22 March 23

స్టాక్​మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 200 పాయింట్లకుపైగా పెరిగింది. ప్రస్తుతం 50 వేల మార్కు వద్ద ఊగిసలాడుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 14 వేల 795 వద్ద కొనసాగుతోంది. 

అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ పరిస్థితులు, కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళనలు ఉన్నా... ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బలోపేతం లాభాలకు కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎస్​బీఐ, ఇన్ఫోసిస్​​, హెచ్​సీఎల్​ టెక్​, మారుతి, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​,టీసీఎస్​, షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఎన్​టీపీసీ, కోటక్ మహేంద్ర బ్యాంక్​, పవర్​ గ్రిడ్​,ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ, సన్​ఫార్మా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

08:57 March 23

లైవ్​: స్టాక్​మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 337 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 50 వేల 109 ఎగువన ఉంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 101 పాయింట్లకుపైగా లాభంతో 14 వేల 838 వద్ద కొనసాగుతోంది. 

ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎం అండ్​ ఎం, భారతీ ఎయిర్​టెల్​, మారుతీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​,జజాజ్​ ఆటో, బజాజ్​ఫైనాన్స్, టీసీస్​​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఎన్​టీపీసీ, కోటక్ మహేంద్ర బ్యాంక్​, పవర్​ గ్రిడ్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

Last Updated : Mar 23, 2021, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details