స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా రికార్డు లాభాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 546 పాయింట్లు పెరిగి నూతన గరిష్ఠ స్థాయి అయిన 53,370 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో జీవనకాల గరిష్ఠమైన 16,259 వద్దకు చేరింది.
- హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు ప్రధానంగా లాభాలను గడించాయి.
- టైటాన్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.