తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 260 ప్లస్​ - సన్సెక్స్

Stocks Live Updates
స్టాక్స్ లైవ్​ అప్​డేట్స్​

By

Published : Apr 15, 2021, 9:24 AM IST

Updated : Apr 15, 2021, 3:41 PM IST

15:37 April 15

ఒడుదొడుకుల సెషన్​ను చివరకు లాభాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్​ 260 పాయింట్ల లాభంతో 48,804 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 77 పాయింట్లు బలపడి 14,581 వద్ద ముగిసింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టీసీఎస్​, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, డాక్టర్​ రెడ్డీస్​, హెచ్​డీఎఫ్​సీ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

మారుతీ, ఇన్ఫోసిస్​, ఇండస్​ఇండ్ బ్యాంక్​, బజాజ్ ఫినాన్స్, అల్ట్రాటెక్​ సిమెంట్, నెస్లే షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

14:34 April 15

స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి కాస్త తేరుకున్నాయి. సెన్సెక్స్​ 20 పాయింట్లకుపైగా పెరిగి.. 48,572 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 8 పాయింట్లు పుంజుకుని 14,512 వద్ద ఫ్లాట్​గా కొనసాగుతోంది.

  • టీసీఎస్​, ఓఎన్​జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఇన్ఫోసిస్, మారుతీ, ఇండస్​ఇండ్ బ్యాంక్, నెస్లే, బజాజ్ ఫినాన్స్, అల్ట్రాటెక్​ సిమెంట్ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

10:45 April 15

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల దిశగా కదులుతున్నాయి. సెన్సెక్స్​ 310 పాయింట్లకుపైగా కోల్పోయి.. 48,230 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 80 పాయింట్లకుపైగా నష్టంతో 14,418 వద్ద కొనసాగుతోంది.

ఐటీ, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్ షేర్లు కూడా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.

  • ఓఎన్​జీసీ, సన్​ఫార్మా, టీసీఎస్​, డాక్టర్​ రెడ్డీస్​​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, పవర్​గ్రిడ్​ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో లాభాల్లో ఉన్నాయి.
  • ఇన్ఫోసిస్​, ఇండస్​ఇండ్ బ్యాంక్​, మారుతీ, బజాజ్​ ఫినాన్స్, అల్ట్రాటెక్​ సిమెంట్, ఎం&ఎం నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

09:54 April 15

మళ్లీ నష్టాలు..

స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్​ 230 పాయింట్లకుపైగా నష్టంతో 48,307 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లకుపైగా క్షీణించి..14,450 వద్ద కొనసాగుతోంది.

ఓఎన్​జీసీ, డాక్టర్​ రెడ్డీస్, సన్​ఫార్మా, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి.

ఇన్ఫోసిస్​, ఇండస్​ఇండ్ బ్యాంక్, మారుతీ, ఎం&ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫినాన్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:02 April 15

నిఫ్టీ 50 ప్లస్​..

స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 110 పాయింట్లకుపైగా పెరిగి 48,657 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 50 పాయింట్లకుపైగా లాభంతో 14,559 వద్ద కొనసాగుతోంది.

  • ఓఎన్​జీసీ, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • ఇన్ఫోసిస్​, ఎం&ఎం, టెక్ మహీంద్రా, హెచ్​సీఎల్​టెక్​, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Apr 15, 2021, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details