తెలంగాణ

telangana

ETV Bharat / business

stock market live: వరుసగా రెండో రోజు మార్కెట్లకు లాభాలు

stock market live
స్టాక్​ మార్కెట్​ లైవ్​

By

Published : Oct 26, 2021, 9:26 AM IST

Updated : Oct 26, 2021, 3:57 PM IST

15:56 October 26

మార్కెట్ల జోరు..

స్టాక్ ​మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. నాలుగు సెషన్ల పతనం అనంతరం.. వరుసగా రెండో రోజు లాభాలను నమోదుచేశాయి. ఆటో, లోహ, రియల్టీ రంగం షేర్లు రాణించడం.. మార్కెట్ల లాభాలకు కారణం. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 383 పాయింట్లు పెరిగి.. 61 వేల 350 వద్ద స్థిరపడింది.

11:00 October 26

ఆరంభ లాభాలు ఆవిరి..

దేశీయ స్టాక్​మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. రిలయన్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టెక్​ మహీంద్ర లాభాలు బాట పట్టడం వల్ల తొలుత 300 పాయింట్లకుపైగా వృద్ధి చెందిన సెన్సెక్​.. ప్రస్తుతం 25పాయింట్ల లాభాలతో 60,993 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 25పాయింట్లు మెరుగుపడి 18,150 వద్ద ట్రేడ్​ అవుతోంది.

టెక్​మహీంద్ర, టాటా మోటర్స్​, టాటా స్టీల్​ లాభాల్లో ఉన్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, కొటాక్​ బ్యాంక్​లు  నష్టాల్లో కొనసాగుతున్నాయి.

08:54 October 26

stock market live: వరుసగా రెండో రోజు మార్కెట్లకు లాభాలు

దేశీయ స్టాక్​మార్కెట్లు మంగళవారం ఫ్లాట్​గా మొదలయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 257 పాయింట్లు మెరుగుపడి 61,224 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 74 పాయింట్లు వృద్ధి చెంది 18,200 వద్ద ట్రేడ్​ అవుతోంది.

టెక్​మహీంద్ర, టాటా మోటర్స్​, ఇన్​ఫోసిస్​ లాభాల్లో కొనసాగుతున్నాయి.

డాక్టర్​ రెడ్డీస్​, కొటాక్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​ నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : Oct 26, 2021, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details