తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయ సానుకూలతలతో మార్కెట్లకు లాభాలు - bse sensex today

Stock market
స్టాక్ మార్కెట్

By

Published : Sep 25, 2020, 9:32 AM IST

Updated : Sep 25, 2020, 10:27 AM IST

10:15 September 25

వారాంతంలో లాభాల్లో మార్కెట్లు..

వరుసగా ఆరు రోజులు నష్టాలను చవి చూసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు ఎట్టకేలకు తిరిగి లాభాల్లోకి మళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 256 పాయింట్లు వృద్ధి చెంది 36,809 పాయింట్లకు చేరింది.  

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 77 పాయింట్లు బలపడి 10,883 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు బిహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించనున్న నేపథ్యంలో మదుపర్లు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.

లాభనష్టాల్లో..

టీసీఎస్​, హెచ్​సీఎల్​ టెక్, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే, భారతి ఎయిర్​టెల్​ లాభాల్లో ఉన్నాయి.  

టైటాన్​, కొటక్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు వెనకబడ్డాయి.  

వాల్​స్ట్రీట్​ ప్రభావం..

అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగియటం వల్ల ఆసియా మార్కెట్లు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఆసియాలోని ప్రధాన మార్కెట్లు హాంకాంగ్, జపాన్, ధక్షిణ కొరియా లాభాల్లో సాగుతున్నాయి. షాంఘై కాంపొజిట్ నష్టాల్లో ఉంది.  

చమురు..

అంతర్జాతీయ మార్కెట్​లో బ్రెంట్ క్రూడ్ ధర స్వల్పంగా పెరిగి బ్యారెల్​కు 42.11 డాలర్ల వద్ద కొనసాగుతోంది.  

09:31 September 25

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా లాభంతో 36 వేల 865 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 85 పాయింట్లు వృద్ధి చెంది 10 వేల 890 వద్ద కొనసాగుతోంది. 

Last Updated : Sep 25, 2020, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details