తెలంగాణ

telangana

ETV Bharat / business

కొనుగోళ్లకు మదుపరుల ఆసక్తి- లాభాల్లో మార్కెట్లు - stock market prices in profits

గతవారం భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు పుంజుకున్నాయి. తక్కువ ధరలకు షేర్లను కొనుగోలు చేసేందుకు మదుపరులు ఆసక్తి చూపిన నేపథ్యంలో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 565 పాయింట్లు వృద్ధి చెంది 38, 862వద్ద ట్రేడవుతోంది. 159 పాయింట్ల లాభంతో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 11, 360 వద్ద కొనసాగుతోంది.

stocks
షేర్ల కొనుగోలుకు మదుపరుల ఆసక్తి- లాభాల్లో మార్కెట్లు

By

Published : Mar 2, 2020, 10:13 AM IST

Updated : Mar 3, 2020, 3:20 AM IST

గత వారాంతంలో భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్​ మార్కెట్ సూచీలు నేడు లాభాల బాట పట్టాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ షేర్ల కొనుగోలుకు అంతర్జాతీయ మదుపరులు ఆసక్తి చూపిన నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో గరిష్ఠంగా 785 పాయింట్లను తాకిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 565 పాయింట్ల వృద్ధితో 38, 862 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 159 పాయింట్లు లాభపడి 11, 360 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో ఉన్న షేర్లు

రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఓఎన్​జీసీ, టైటాన్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో ఉన్న షేర్లు

కోటక్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

బలపడిన రూపాయి

డాలరు మారకం విలువతో పోలిస్తే రూపాయి విలువ 15 పైసలు బలపడి 72.09 గా ఉంది.

ఆసియా మార్కెట్లు

షాంఘై, హాంకాంగ్, సియోల్, టోక్యో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:జీవిత బీమా క్లెయిం చేసుకోవడం ఎలానో తెలుసా?

Last Updated : Mar 3, 2020, 3:20 AM IST

ABOUT THE AUTHOR

...view details