కొత్త వార్షిక ఏడాదికి దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో స్వాగతం పలికాయి. కరోనా భయాలు మార్కెట్లను వెంటాడడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 714 పాయింట్లు కోల్పోయి 28,753 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 199 పాయింట్లు క్షీణించి 8,398 వద్ద కొనసాగుతోంది.
నష్టాల్లో...
కొటక్ బ్యాంక్ షేర్లు 8 శాతం మేర నష్టపోయాయి. ఎస్బీఐ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.
లాభాల్లో...
హిమాద్రి స్పెషాలిటీ, జుబిలియంట్ లైఫ్ సైన్సెస్, సుప్రజిత్ ఇంజినీరింగ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా అడ్వాన్స్‌డ్ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.
కారణం...
- అంతర్జాతీయంగా కరోనా విజృంభణ కొనసాగుతుండడం.
- ఈ ప్రభావం ఆర్థిక రంగంపై భారీ స్థాయిలో ఉండనుందన్న ఐరాస హెచ్చరికల నేపథ్యంలో మదుపర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
- ఈ పరిణామాలతో భారత్ సహా ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒక్క షాంఘై సూచీ మాత్రం లాభాల్లో ఉంది.
రూపాయి...
డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.74 వద్ద ట్రేడవుతోంది.
చమురు ధరలు...
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ 0.76 శాతం తగ్గింది. బ్యారెల్ ముడిచమురు ధర 26.15 డాలర్లకు చేరింది.