తెలంగాణ

telangana

ETV Bharat / business

బడ్జెట్​ ప్రభావంతో సెన్సెక్స్​ 600 పాయింట్లు ఉఫ్

స్టాక్​ మార్కెట్లపై బడ్జెట్​ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. వార్షిక పద్దు నిరాశపరచడం సహా అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్దుగా ఉండటం వల్ల సెన్సెక్స్​ 600 పాయింట్లు నష్టపోయింది. ఈ ఏడాది ఇదే అతిపెద్ద పతనం.

By

Published : Jul 8, 2019, 11:51 AM IST

Updated : Jul 8, 2019, 12:29 PM IST

సెన్సెక్స్​

కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిన​ కారణంగా స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బాంబే స్టాక్​ ఎక్స్చేంజి సూచీ (సెన్సెక్స్)​ రికార్డు స్థాయిలో 600 పాయింట్లకుపైగా పడిపోయింది. ఈ ఏడాది ఒక్కరోజులో అతిపెద్ద పతనం ఇదే.

ప్రస్తుతం సెన్సెక్స్​ 38,910 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 185 పాయింట్ల నష్టంతో 11,620 వద్ద ట్రేడవుతోంది.

పీఎన్​బీ ప్రభావం

బడ్జెట్​కు తోడుగా పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ (పీఎన్​బీ)లో భూషన్​ పవర్​, స్టీల్​ సంస్థ రూ.3,800 కోట్ల అక్రమాలు వెలుగు చూసిన నేపథ్యంలో బ్యాంకింగ్​ రంగం కుదేలయింది. ఈ బ్యాంకు 11 శాతం షేర్లు నష్టపోయింది. నిఫ్టీలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 5 శాతం మేర నష్టపోయాయి.

బజాజ్​ ఫైనాన్స్​, ఐఓసీ, ఓఎన్​జీసీ, హీరోమోటో కార్ప్, ఎస్బీఐ 4.5 శాతం మేర పతనమయ్యాయి.

ఇదీ చూడండి: ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో భారీ నష్టాలు

Last Updated : Jul 8, 2019, 12:29 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details