స్టాక్ మార్కెట్లు ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు, కరోనా వైరస్ వార్తలపై దృష్టి సారించే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటికి తోడు ఈ వారం నాలుగు రోజులే మార్కెట్లు పని చేయనుండటమూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చని తెలుస్తోంది.
- 'శ్రీరామ నవమి' సందర్భంగా ఏప్రిల్ 2 (గురువారం) మార్కెట్లకు సెలవు.
కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం, ఆర్బీఐ ప్రకటించిన ఉద్దీపనలు మార్కెట్లపై పరిమిత ప్రభావం చూపిస్తాయని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. ఉద్దీపనలకు తోడు కరోనా ప్రభావం ఎంత వరకు ఉంది అనే అంశం ఆధారంగానే రిలీఫ్ ర్యాలీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.