కంపెనీల త్రైమాసిక ఆదాయాలు, ద్రవ్యోల్బణం సహా వాణిజ్య ఒప్పందంపై అమెరికా-చైనాల సంతకం వంటి అంశాలపై ఈ వారం ఈక్విటీ మార్కెట్ ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
"క్యూ3 ఆదాయాలు, బడ్జెట్ వంటి అంశాలపై ఈ వారం మార్కెట్ దృష్టి నెలకొంది. విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంస్థలు ఈ వారం తమ మూడో త్రైమాసిక ఆదాయాలను ప్రకటించనున్నాయి."-సంతోష్ మీనా, సీనియర్ రీసెర్చీ అనలిస్ట్, ట్రేడింగ్ బెల్స్
సంస్థ అంతర్గత ఆడిట్ కమిటీ కంపెనీ యాజమాన్యానికి క్లీన్ చిట్ ఇచ్చినందున సోమవారం ఇన్ఫోసిస్ షేర్లు సానుకూలంగా స్పందించవచ్చని మీనా పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ శుక్రవారం విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించవచ్చన్నారు.