తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ షేర్లు డీలా- 50 వేల మార్క్​ దిగువకు సెన్సెక్స్​ - మార్కెట్​ అప్​డేట్స్

Indices trade lower in pre-opening of wednesday
ఐటీ, ఆర్థిక షేర్లు డీలా- 50 వేల మార్క్​ని కోల్పోయిన సెన్సెక్స్​

By

Published : Mar 31, 2021, 9:28 AM IST

Updated : Mar 31, 2021, 12:51 PM IST

12:36 March 31

స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. మిడ్​ సెషన్​కు ముందు సెన్సెక్స్​ 444 పాయింట్లకుపైగా కోల్పోయి 49,691 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 103 పాయింట్ల నష్టంతో 14,741 వద్ద కొనసాగుతోంది. 

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులతో పాటు, మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం వల్ల మార్కెట్లు నష్టాల బాట పట్టినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

  • ఎస్​బీఐ, ఐటీసీ, బజాజ్​ ఫిన్​సర్వ్​, మారుతి, సన్​ఫార్మా, టీసీఎస్​, యాక్సిస్​ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, పవర్​గ్రిడ్, ఇన్ఫోసిస్​, టెక్​ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:06 March 31

లైవ్​ అప్​డేట్స్​: స్టాక్​​మార్కెట్

స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్​ను నష్టాలతో  ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 407 పాయింట్లు కోల్పోయి.. 49,729 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 102 పాయింట్ల నష్టపోయి.. 14,742 వద్ద కొనసాగుతోంది.

బజాజ్​ ఫిన్​సర్వ్​, యాక్సిస్​ బ్యాంక్, అల్ట్రాటెక్​ సిమెంట్​, ఎన్​టీపీసీ, డా. రెడ్డీస్​, ఎల్​ అండ్​ టీ, సన్​ఫార్మా షేర్లు లాభాల బాటలో ఉన్నాయి.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​, ఐసీఐసీఐ బ్యాంక్​, పవర్​ గ్రిడ్​, కోటక్​ మహీంద్ర బ్యాంక్​, ఓఎన్​జీసీ, ఇన్ఫోసిస్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Mar 31, 2021, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details