తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లకు భారీ లాభాలు- సెన్సెక్స్​ 750 ప్లస్​ - stock market live

వరుస నష్టాల అనంతరం.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలు గడించాయి. సెన్సెక్స్ 750 పాయింట్లు పెరిగి.. 49,850 వద్ద స్థిరపడింది. 232 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ..14,762 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఆటో, ఫార్మా రంగ షేర్లు రాణించాయి.

indian markets closed with positively
భారీ లాభాల్లో సూచీలు- 750 పాయింట్లు బలపడిన సెన్సెక్స్​

By

Published : Mar 1, 2021, 3:43 PM IST

Updated : Mar 1, 2021, 3:52 PM IST

జీడీపీ గణాంకాలు సానుకూలంగా ఉండటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఉత్సాహకరమైన సంకేతాలు అందుకున్న నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాల్లో పయనించాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు మార్కెట్లలో జోరు నింపాయి. ఐటీ, ఫార్మా రంగ కంపెనీల షేర్లు సైతం లాభాలు గడించాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 750 పాయింట్లు పెరిగింది. చివరకు 49,850 వద్ద సెషన్​ను ముగించింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 232 పాయింట్లు వృద్ధి చెంది.. 14,762 వద్ద స్థిరపడింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 50,058 పాయింట్ల అత్యధిక స్థాయి , 49,440 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 14,806 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,638 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లో..

పవర్​ గ్రిడ్​, ఓఎన్​జీసీ, ఏషియన్​ పెయింట్స్​, కోటక్​బ్యాంక్​, టైటాన్​, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​సీఎల్​ టెక్​, టెక్​ మహీంద్రా షేర్లు రాణించాయి.

30 షేర్ల ఇండెక్స్​లో భారతీ ఎయిర్ టెల్​ మాత్రమే నష్టపోయింది.

Last Updated : Mar 1, 2021, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details