తెలంగాణ

telangana

ETV Bharat / business

రుణగ్రహీతలకు చక్రవడ్డీ మాఫీ ఊరట ఇలా...

కరోనా నేపథ్యంలో విధించిన ఆరు నెలల మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తూ కేంద్రం ఇటీవల ప్రకటన చేసింది. మారటోరియం సదుపాయం వినియోగించుకున్నా.. లేకున్నా ఎంపిక చేసిన రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఈ పథకంతో రుణాలపై లభించే మాఫీ ఎంత అనేది వివరంగా మీ కోసం.

How useful is the interest waiver scheme on interest
వడ్డీపై వడ్డీ మాఫీ పూర్తి వివరాలు

By

Published : Nov 2, 2020, 1:29 PM IST

కొవిడ్‌-19 వ్యాప్తితో మార్చి 2020 చివరి వారం నుంచి దేశవ్యాప్త లాక్​డౌన్ విధించింది కేంద్రం. ఈ నేపథ్యంలో చాలా మంది ఉపాధి కోల్పోవడం, వేతనాల్లో కోతలను ఎదుర్కొన్నారు. ఫలితంగా వారు పూర్తి లేదా పాక్షిక సంపాదన కోల్పోయారు. అయితే అప్పటికే అనేక మంది ఇంటి రుణం, ఆటో రుణం, క్రెడిట్ కార్డు, విద్యా రుణం, సూక్ష్మ, మధ్య చిన్న తరహా పరిశ్రమల రుణాలు (ఎంఎస్ఎంఈ), వ్యక్తిగత, వృత్తిపర రుణాలు ,వినియోగ వస్తువుల కొనుగోలు రుణాలు వంటివి తీసుకున్నారు. ఈ రుణాలపై ఈఎంఐలను చెల్లించడం చాలా కష్టమైంది.

దీని నుంచి ఉపశమనం కలిగించడానికి రిజర్వు బ్యాంక్ మూడు నెలలు మారటోరియం విధించింది. అంటే 29 ఫిబ్రవరి, 2020 నాటికి ఉన్న రుణాలను మూడు నెలలు అంటే 31 మే 2020 వరకు చెల్లించలేక పోయినా, వారి క్రెడిట్ స్కోర్​పై ఎటువంటి ప్రభావం చూపబోదని తెలిపింది. ఆ తరువాత మారటోరియంను మరో మూడు నెలలు అంటే 31 ఆగష్టు ,2020 వరకు పొడిగించింది.

తాజాగా మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్ధిక శాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం, చక్రవడ్డీకి, సాధారణ వడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని, రుణ గ్రహీతల ఖాతాలకు బ్యాంకులు చెల్లించడం అనివార్యమైంది.

ఈ కింది పట్టిక ద్వారా వివిధ వడ్డీ రేట్లకు ఆరు నెలలకు ఎంత చక్రవడ్డీ, ఎంత సాధారణ వడ్డీ వర్తిస్తుందో తెలుసుకోవచ్చు.

ఉదా : రూ. లక్షకు 8 శాతం వడ్డీ రేటుతో ఆరు నెలల కాలానికి చక్రవడ్డీ మొత్తం రూ.4,067 అవుతుంది. అందులో సాధారణ వడ్డీ రూ.4,000. కాబట్టి తిరిగి పొందే మొత్తం రూ. 67.

అలాగే, రూ. 10 లక్షల రుణం పై 8 శాతం వడ్డీతో ఆరు నెలల కాలానికి తిరిగి పొందే మొత్తం రూ. 673.

అదే విధంగా రుణం రూ 10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వివిధ శాతాలలో ఎంత తిరిగి పొందొచ్చో కింద పట్టికలో వివరంగా చూడొచ్చు.

గమనిక: ఇది అవగాహన కోసం మాత్రమే.

వివిధ వడ్డీ రేట్ల వద్ద లభించే ఊరట ఇలా..

ఇవీ చూడండి:

చక్రవడ్డీ మాఫీపై సందేహాలకు ఆర్థిక శాఖ స్పష్టత

'పంట, ట్రాక్టర్ రుణాలకు చక్రవడ్డీ మాఫీ వర్తించదు'

చక్రవడ్డీ మాఫీ పథకాన్ని అమలు చేయండి: ఆర్​బీఐ

ABOUT THE AUTHOR

...view details