తెలంగాణ

telangana

ETV Bharat / business

'మ్యూచువల్ ఫండ్స్'కు ఆర్​బీఐ భారీ ప్యాకేజీ - కరోనా సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు ఆర్బీఐ చర్యలు

కరోనా కారణంగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థలపై ఒత్తిడిని తగ్గించేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.50 వేల కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ సదుపాయాన్ని ప్రకటించింది.

rbi announces huge package to mutual funds
మ్యూచువల్ ఫండ్లకు ఆర్​బీఐ అండ

By

Published : Apr 27, 2020, 12:10 PM IST

కరోనా సంక్షోభం నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు అండగా నిలిచేందుకు రిజర్వు బ్యాంక్ చర్యలు ప్రారంభించింది. రూ.50 వేల కోట్లతో లిక్విడిటీ సదుపాయం అందిచాలని నిర్ణయించింది. ఈ ప్యాకేజీ నేటి నుంచి మే 11 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.

ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ప్రాంక్లిన్ టెంపుల్​​టన్.. కరోనా కారణంగా ఆరు రుణ పథకాలను రద్దు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్​బీఐ చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

లాక్​డౌన్​ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థల స్థిరత్వాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్​బీఐ భరోసా ఇచ్చింది. ప్రస్తుతానికి రిస్క్ ఎక్కువగా ఉండే ఫండ్లలో మాత్రమే లిక్వడిటీ ఒత్తిడి ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి:'పన్నుల పెంపు' ఉచిత సలహాపై కేంద్రం ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details