తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుస రాకెట్ దాడులతో పెట్రోల్​ ధరలకు రెక్కలు

దేశ వ్యాప్తంగా వరుసగా నాలుగో రోజూ పెట్రోల్​, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్​ పెట్రోల్​ ధర (దిల్లీలో) నేడు 9 పైసలు పెరిగి రూ.75.54కు చేరింది. డీజిల్ ధర లీటర్​కు(దిల్లీలో) 11 పైసలు పెరిగింది.

By

Published : Jan 5, 2020, 12:19 PM IST

PETROL
Etv - Bharat

పశ్చిమాసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో.. చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దేశీయ మార్కెట్లో వరుసగా నాలుగో రోజూ పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయి.

దేశ రాజధాని దిల్లీలో నేడు.. లీటర్​ పెట్రోల్​ ధర 9 పైసలు పెరిగి.. రూ.75.54కు చేరింది. డీజిల్​ ధర లీటర్​కు 11 పైసల వృద్ధితో రూ.68.51కు చేరింది.

ఇరాన్​ జనరల్​ ఖాసీం​ సులేమనీని.. ఇరాక్​ రాజధాని బగ్దాద్​ విమానాశ్రయంలో.. రాకెట్​ దాడి చేసి మట్టుబెట్టింది అమెరికా. ఈ దాడితో.. పశ్చిమాసియాలో ఒక్కసారిగా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఫలితంగా చమురు ధరలు ఆ రోజు 3 శాతానికిపైగా పెరిగాయి. చమురు అవసరాలకు దిగుమతులపైనే ఆధారపడే మన దేశంలో పెట్రోల్, డీజిల్​ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

నాలుగు రోజుల్లో 55 పైసలు..

జనవరి 2 నుంచి లీటర్ పెట్రోల్ ధర 38 పైసలు, లీటర్ డీజిల్​ ధర 55 పైసలు పెరిగాయి.

దిగుమతులపైనే ఆధారం..

ప్రస్తుతం భారత్​ 84 శాతం చమురు అవసరాలను దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. ఇరాక్​, సౌదీ అరేబియా, ఇరాన్​లు మనకు ప్రధాన ఎగుమతిదారులుగా ఉన్నాయి. ఈ కారణంగా అంతర్జాతీయంగా తలెత్తే వివాదాల ప్రభావం మన దేశంపై ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ బెంచ్​మార్క్​లకు అనుగుణంగానే దేశీయ చమురు ధరల సవరణ జరుగుతుంది.

ముప్పేమి లేదు..

పశ్చిమాసియాలో ఆందోళనలు ఉన్నా సరఫరాకు అప్పుడే ముప్పు లేదని అధికారులు అంటున్నారు. ప్రస్తుతానికి ధరల్లో పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు.

ఇదీ చూడండి:భవిష్యత్తు ఇంకెంత 'స్మార్ట్​'గా ఉండనుందో..!

ABOUT THE AUTHOR

...view details