తెలంగాణ

telangana

ETV Bharat / business

RBI Report: కరోనా భయాలు- ఇంట్లోనే డబ్బులు!

కరోనా నేపథ్యంలో కరెన్సీ చలామణి విలువ పరంగా 2020-21లో 16.8శాతం పెరిగినట్లు ఆర్​బీఐ వార్షిక నివేదికలో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద.. 2,08,625 నకిలీ నోట్లు (Counterfeit notes in India) బయటపడ్డాయని తెలిపింది.

Notes in circulation go up
చలామణిలో ఉన్న మొత్త కరెన్సీ

By

Published : May 27, 2021, 5:06 PM IST

2020-21లో..దేశంలో కరెన్సీ చలామణి (Notes in circulation in India) సగటుతో పోలిస్తే.. విలువ పరంగా 16.8శాతం పెరిగినట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ వార్షిక నివేదిక (RBI annual report) వెల్లడించింది. నోట్ల పరంగా 7.2శాతం పెరిగినట్లు పేర్కొంది. కరోనా మహమ్మారి వల్ల చాలా మంది నగదును ఎక్కువ మొత్తంలో నిల్వ పెట్టుకోవడం ఇందుకు ప్రధానం కారణంగా వెల్లడించింది. 2019-20లో ఈ వృద్ధి 14.7 శాతం (విలువ పరంగా), 6.6 శాతం (నోట్ల సంఖ్య పరంగా) నమోదైనట్లు వివరించింది ఆర్​బీఐ.

ఆర్​బీఐ నివేదికలోని ముఖ్యాంశాలు..

  • 2021 మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో(Total Currency in Circulation) రూ.500, రూ.2 వేల నోట్ల విలువే 85.7 శాతం. గత ఏడాది ఇదే సమయంలో ఈ విలువ 83.4 శాతం.
  • అత్యధికంగా చలామణిలో ఉన్న నోట్లు(సంఖ్య పరంగా) రూ.500. మొత్తం నోట్లలో వీటి వాటానే 31.1 శాతం.
  • మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.10 నోట్ల వాటా (సంఖ్య పరంగా) 23.6 శాతం (రెండో స్థానం).
  • గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద దేశంలో 2,08,625 నకిలీ నోట్లు (Counterfeit notes in India) బయటపడ్డాయి. ఇందులో 3.9శాతం నోట్లను ఆర్​బీఐ, 96.1 శాతం నోట్లను ఇతర బ్యాంకులు గుర్తించాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నకిలీ నోట్లు తగ్గాయి.
  • గడిచిన దశాబ్దంలో చలామణిలో ఉన్న కరెన్సీ (సంఖ్య పరంగా) రెట్టింపైంది. 2009-10లో 5,654 కోట్ల నోట్లు చలామణిలో ఉండగా.. 2019-20 నాటికి ఆ సంఖ్య 11,597 కోట్లకు పెరిగింది.

ఇదీ చదవండి:RBI: వృద్ధి అంచనాలపై కరోనా రెండో దశ ఎఫెక్ట్​

ABOUT THE AUTHOR

...view details