తెలంగాణ

telangana

By

Published : Nov 18, 2019, 7:09 PM IST

Updated : Nov 18, 2019, 11:23 PM IST

ETV Bharat / business

ఆయుష్మాన్​ 2.0: మధ్యతరగతి కోసం కొత్త ఆరోగ్య పథకం!

మధ్యతరగతి వారికి ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసే యోచనలో ఉంది నీతి ఆయోగ్. ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి వచ్చే పేదవారిని మినహాయించి ఈ వ్యవస్థ రూపుదిద్దుకోనుంది. ఇందుకోసం ఓ ప్రణాళిక నివేదికను బిల్​గేట్స్​ సమక్షంలో విడుదల చేసింది నీతి ఆయోగ్​.

ఆయుష్మాన్​ 2.0: మధ్యతరగతి కోసం కొత్త ఆరోగ్య పథకం!


ఇప్పటివరకు ఏ ఆరోగ్య సంరక్షణ పథకం పరిధిలో లేని మధ్యతరగతి ప్రజల కోసం ఒక ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తోంది నీతి ఆయోగ్​. దేశంలో 40 శాతం జనాభాకు అందుతున్న ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి వచ్చేవారిని మినహాయించి కొత్త ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.

నివేదిక సిద్ధం

కొత్త ఆరోగ్య వ్యవస్థపై ప్రపంచ కుబేరుడు బిల్​గేట్స్ సమక్షంలో దిల్లీలో నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​ రాజీవ్ కుమార్ ఓ నివేదికను విడుదల చేశారు.

'ధనికులు వైద్య అవసరాలకు అయ్యే ఖర్చును భరించే శక్తి కలిగి ఉన్నారు. పేదల కోసం ఆయుష్మాన్​ భారత్​ ఎలాగో ఉంది. ఇప్పటికీ 50శాతం మంది ఏ ఆరోగ్య పథకమూ అందక ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇప్పుడు ఆరోగ్య వ్యవస్థను మధ్యతరగతి వారికీ అందుబాటులో ఉంచేందుకు ఓ మార్గాన్ని నిర్దేశించడమే ఈ నివేదిక​ ముఖ్య ఉద్దేశం' అన్నారు నీతి ఆయోగ్​ సలహాదారు అలోక్ కుమార్.​

మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది లేని రీతిలో రూ.200-300 ప్రీమియంతో కొత్త ఆరోగ్య సంరక్షణ పథకాన్ని రూపొందిస్తున్నట్లు సంకేతాలిచ్చారు కుమార్.

ఇదీ చదవండి:సైకిల్, ఈ-కార్​, మాస్క్​తో ఎంపీల 'ప్రకృతి ప్రేమ'

Last Updated : Nov 18, 2019, 11:23 PM IST

ABOUT THE AUTHOR

...view details