లాక్డౌన్ ఎత్తివేయడంలో భారత్ అత్యంత తెలివిగా వ్యవహరించాలని అన్నారు రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. ఆర్థిక వ్యవస్థను సరైన పద్ధతిలో పునరుద్ధరించాలని సూచించారు. ఎక్కువ కాలం లాక్డౌన్ కొనసాగించి, ప్రజలకు సాయం అందించే సామర్థ్యం లేనందున.. భారత్ సరైన విధానాలు అనుసరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
దేశ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 ప్రభావం గురించి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో జరిగిన వీడియో సంభాషణలో ఈ విషయాలు వెల్లడించారు రాజన్.