కరోనా వైరస్ మహమ్మారితో రాబోతున్న మాంద్యం, 2008 అంతర్జాతీయ మాంద్యం కన్నా దారుణంగా ఉండబోతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా అభిప్రాయపడ్డారు.
'2008 మాంద్యంకన్నా తీవ్రంగా కరోనా సంక్షోభం'
కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్). ఈ మహమ్మారి కారణంగా మునుపెన్నడూ చూడనంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నట్లు తెలిపింది.
"ఐఎంఎఫ్ చర్రితలోనే ఇలాంటి సంక్షోభం ఎప్పుడూ చూడలేదు. ప్రస్తుతం మనం మాంద్యంలోకి జారుకున్నాం. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో పోలిస్తే మరింత దుర్భర పరిస్థితిలో ఉన్నాం. 90 దేశాలు ఇప్పటికే అత్యవసర సాయం కావాలని ఐఎంఎఫ్‌ను సంప్రదించాయి. ఆరోగ్య ఖర్చులకు ప్రాధాన్యం ఇవ్వాలని, వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని ఆయా దేశాలకు సూచించాం" -క్రిస్టలీనా, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్
ఇదీ చూడండి:30ఏళ్ల కనిష్ఠానికి దేశ ఆర్థిక వృద్ధి- 2020-21లో 2%!