తెలంగాణ

telangana

ETV Bharat / business

'రూ.1.45 లక్షల కోట్ల పన్ను రీఫండ్' - ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను రిఫండ్​

ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు మొత్తం రూ.1.45 లక్షల కోట్ల పన్ను రీఫండ్ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. 89 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ఈ మొత్తాన్ని బదిలీ చేసినట్లు వివరించింది.

Income Tax refund news
ఆదాయపు పన్ను రీఫండ్ లెక్కలు

By

Published : Dec 11, 2020, 4:08 PM IST

పన్ను చెల్లింపుదారులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు (డిసెంబర్ 8 వరకు) మొత్తం రూ.1,45,619 కోట్లు రీఫండ్ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. 89.29 లక్షల పన్ను చెల్లింపుదారులకు ఈ మొత్తం బదిలీ చేసినట్లు వెల్లడించింది.

మొత్తం పన్ను చెల్లింపుదారుల్లో కార్పొరేట్లతో సహా.. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులూ ఉన్నట్లు వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి పన్ను రీఫండ్ చేస్తోంది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ).

ఇదీ చూడండి:తగ్గిన బంగారం, వెండి ధరలు

ABOUT THE AUTHOR

...view details