తెలంగాణ

telangana

ETV Bharat / business

గుడ్​ న్యూస్​: ఈఎస్​ఐ, ఈపీఎఫ్​తో అదనపు ప్రయోజనాలు

దేశంలో కరోనా మృతులు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం కార్మిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈఎస్​ఐసీ, ఈపీఎఫ్​ ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను పరిధిని మరింత విస్తరించింది. కొవిడ్​-19కు వర్తించేలా అదనపు ప్రయోజనాలు కల్పించనున్నట్లు ప్రకటించింది.

ESIC, EPFO
ఈఎస్​ఐసీ, ఈపీఎఫ్​ఓ

By

Published : May 30, 2021, 4:56 PM IST

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్​ఓ), ఎంప్లాయిస్​ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్​ (ఈఎస్​ఐసీ) అందించే సామాజిక భద్రత పథకాల ద్వారా మరిన్ని ప్రయోజనాలు కల్పించనున్నట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది.

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్​ఓ) చందాదారులకు అందించే ఉద్యోగుల డిపాజిట్​ లింక్డ్​ ఇన్సూరెన్స్ (ఈడీఎల్​ఐ) పరిహారం మొత్తాన్ని పెంచినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ పథకంలోని సభ్యులు కరోనాతో మరణిస్తే నామినీకి గరిష్ఠ బీమా మొత్తాన్ని రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచినట్లు వివరించింది.

ఈఎస్ఐ ​ద్వారా పెన్షన్​ను అర్హులైన ఉద్యోగి ఎవరైనా కరోనాతో మృతి చెందితే వారిపై ఆధారపడిన వారికి పెన్షన్​ ఇవ్వనున్నట్లు తెలిపింది కార్మిక శాఖ.

'ఇటీవల కరోనా మరణాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో తమ కుటుంబ భద్రతపై ఆందోళన మొదలైంది. వారికి మెరుగైన సామాజిక భద్రత కల్పించేందుకు ఈ అదనపు ప్రయోజనాలు అందిస్తున్నాం.' అని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇదీ చదవండి:New IT rules: కొత్త నిబంధనలతో గూగుల్​, ఫేస్​బుక్​ అప్​డేట్​!

ABOUT THE AUTHOR

...view details