తెలంగాణ

telangana

ETV Bharat / business

పద్దు 2020: గ్రామీణ, వ్యవసాయ రంగం డిమాండ్లేంటి? - బడ్జెట్ అంచనాలు లేటెస్ట్​ న్యూస్

దేశవ్యాప్తంగా వినియోగ డిమాండ్ తగ్గిపోవడం కారణంగా ప్రస్తుతం దేశ ప్రగతి సూచీ నేలచూపులు చూస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ లేమి ఇందుకు ప్రధాన కారణమని పలు విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సమయంలో దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు రానున్న బడ్జెట్​లో(2020-21) ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది? గత బడ్జెట్​లో గ్రామీణ, వ్యవసాయ రంగానికి కేంద్రం తీసుకున్న చర్యల సంగతేంటి? వీటిపై విశ్లేషకులు ఏమంటున్నారు?

BUDGET RURAL
పద్దు 2020: గ్రామీణ, వ్యవసాయ రంగం డిమాండ్లు ఏంటి?

By

Published : Jan 25, 2020, 6:05 PM IST

Updated : Feb 18, 2020, 9:33 AM IST

పద్దు 2020: గ్రామీణ, వ్యవసాయ రంగం డిమాండ్లు ఏంటి?

ప్రస్తుతం దేశ ఆర్థిక ప్రగతి నెమ్మదిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం వినియోగ డిమాండ్ తగ్గిపోవటం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వస్తు సేవల డిమాండ్ బాగా తగ్గిపోయింది. ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకపోవటం ఇందుకు ప్రధాన కారణం.

దేశంలో సుమారు 50 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మందికి వ్యవసాయమే జీవనాధారంగా ఉంది. ఈ కారణంగా వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకాలు ఎంతో అవసరమని నిపుణులు అంటున్నారు.

కేటాయింపులు పెరగాలి..

2019 వార్షిక బడ్జెట్​లో వ్యవసాయ రంగ నిధుల్లో 75 శాతం వృద్ధి నమోదైంది. వచ్చే ఐదేళ్లలో 10వేల ఫార్మర్​ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్(ఎఫ్​పీఓ) ఏర్పాటు చేస్తామని గత బడ్జెట్లో ప్రభుత్వం తెలిపింది. రైతులకు ఉపయోగపడే వీటి ఏర్పాటు వేగవంతం చేయాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయానికి సంబంధించి ఆవిష్కరణలకూ ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు.. ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్ల వంటి వాటికి జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్​ చాలా కాలంగా వినిపిస్తోంది.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన స్థానంలో కొత్త బీమా, పరిహార పథకం తీసుకురావాలని.. ఇది కాకుంటే ఫార్మర్స్ డిజాస్టర్ డిస్ట్రెస్ రిలీఫ్ కమిషన్ ఏర్పాటు చేయాలని కొందరు కోరుతున్నారు.

మౌలిక సదుపాయాల ఏర్పాటు..

తొందరగా పాడయ్యే పంటలను నిల్వ చేసుకోవటానికి ప్రభుత్వమే అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. డిమాండ్​ పెరిగినప్పుడు సరఫరా తగ్గడం వంటి సమస్యలను అధిగమించేందుకు ఇవి ఉపయోగపడుతాయని నిపుణులు అంటున్నారు. వీటి ద్వారా రైతులతో పాటు వినియోగదారులకూ మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ధరల పెరుగుదలను నియంత్రించవచ్చని వారి మాట. వీటికి సంబంధించి సహకార సమాఖ్యలనూ ప్రోత్సహించవచ్చని వారు అంటున్నారు.

స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేయాలి..

మోదీ ప్రభుత్వం 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2016లోనే ప్రకటించింది. ఈ మేరకు పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది కూడా. అయితే పండించేందుకు చేసిన ఖర్చుపై 50 శాతం ఎక్కువగా మద్దతు ధర ఉండాలన్న స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. దీనికోసం పటిష్టమైన చట్టాన్ని తేవాలని రైతు సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి.

గత బడ్జెట్ ప్రతిపాదనల సంగతేంటి?

గత బడ్జెట్లలో ప్రభుత్వం... వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి చర్యలు చేపట్టింది. 2019 మధ్యంతర బడ్జెట్​లో రైతులకు సంవత్సరానికి రూ.6,000 అందించే కార్యక్రమానికి నాంది పలికింది. ఇందుకోసం రూ.75,000 కోట్లను కేటాయించింది కేంద్రం. ఈ పథకానికి ప్రధాన్​ మంత్రి కిసాన్ సమ్మాన్​ నిధి(పీఎం కిసాన్)​గా నామకరణం చేసింది. అయితే ఈ పథకంలో ఇప్పటి వరకు సగం నిధులు కూడా ఖర్చు చేయలేదని నిపుణులు అంటున్నారు.

అల్ప స్థాయిలో ఇది ఉపయోగపడినా.. దీనికి కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. కేటాయింపులతో పాటు రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచితే వారి వద్ద కొనుగోలు సామర్థ్యం పెరుగుతుందని అంటున్నారు.

ప్రధాన్​ మంత్రి కిసాన్ సమ్మాన్​ నిధి

గ్రామీణ, వ్యవసాయరంగాలకు కేటాయింపులు..

గ్రామాలకు సంబంధించి బడ్జెట్​లో ప్రభుత్వం భారీగానే చర్యలు తీసుకోనుందని విశ్లేషకులు అంటున్నారు. వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపును పెంచే అవకాశం ఉందని వారి మాట.ఈ సారి బడ్జెట్​లో జాతీయ వ్యవసాయ ఎగుమతుల విధానం ప్రకారం చర్యలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెంచేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి వాటికి కేటాయింపులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

గ్రామీణ, వ్యవసాయరంగాలకు కేటాయింపులు..

రాయితీలు, రుణ మాఫీలు..

దేశంలో ఒక శాతం ఉన్న కార్పొరేట్లకు రూ.1.45 లక్షల కోట్ల మేర రాయితీ ఇచ్చినట్లే.. వ్యవసాయ రంగానికి రాయితీలు ఇవ్వాలని అంటున్నారు నిపుణులు. వీటి ద్వారా రైతుల ఆత్మహత్యలు నియంత్రించడం వీలవుతుందని అభిప్రాయపడుతున్నారు. రైతుల రుణాలకు సంబంధించి కేరళ తరహా రుణ విమోచన చట్టం అవసరమని విశ్లేషిస్తున్నారు.

రాయితీలు, రుణ మాఫీలు

ఇవీ చదవండి

Last Updated : Feb 18, 2020, 9:33 AM IST

ABOUT THE AUTHOR

...view details