తెలంగాణ

telangana

ETV Bharat / business

పరిష్కరిద్దాం రండి.. రెస్టారెంట్లతో జొమాటో

భారీ డిస్కౌంట్ల కారణంగా.. ఆన్​లైన్ ఫుడ్​ డెలివరీ సంస్థలపై దేశవ్యాప్తంగా పలు రెస్టారెంట్లు లాగ్​అవుట్​ సమ్మె నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ల నిర్వాహకులు చర్చలకు రావాలని జొమాటో పిలుపునిచ్చింది.

జొమాటో

By

Published : Aug 18, 2019, 5:09 PM IST

Updated : Sep 27, 2019, 10:12 AM IST

రెస్టారెంట్లు, ఆన్​లైన్​ ఫుడ్ డెలివరీ సంస్థల మధ్య తలెత్తిన వివాదాల పరిష్కారానికి రెస్టారెంట్ల నిర్వాహకులతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు 'జొమాటో' ప్రకటించింది. అదే విధంగా రెస్టారెంట్లు 'లాగ్​ అవుట్​ సమ్మె' విరమించాలని కోరింది.

దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో 1,200లకు పైగా రెస్టారెంట్లు ఆన్​లైన్​లో ఆర్డర్ సేవలను రద్దు చేశాయి. ఆన్​లైన్​ సంస్థలు ఇస్తున్న భారీ డిస్కౌంట్ల కారణంగా.. వారి సంప్రదాయ రిజర్వేషన్ వ్యాపారం దెబ్బ తింటుందని ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఇందులో జొమాటో 65 రెస్టారెంట్లను కోల్పోయింది. ఇది 'జొమాటో గోల్డ్'​ పేరుతో ఉన్న పథకంలో 1 శాతానికి సమానం. ఈ నేపథ్యంలో జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ వరుస ట్వీట్​లలో.. రెస్టారెంట్లతో సంధి చేసుకునేందుకు..చర్చలకు రావాలని కోరారు.

"నా లాంటి యువ పారిశ్రామిక వేత్తలు రెస్టారెంట్ వ్యాపారాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధగా ఉంది. వినియోగదారులకు, వ్యాపారులపై భారీ ప్రభావాన్ని చూపే కంపెనీని తీసుకువచ్చాం. కొన్ని సార్లు మేం తప్పులు చేశాం. వాటివల్ల మా వ్యూహాలు అమలు కాలేదు. ఇది మాకొక మేల్కొలుపు లాంటిది. ఇంతకు ముందు చేసినదానికన్నా 100 రెట్లు ఎక్కువగా మా రెస్టారెంట్ భాగస్వాములతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం." - దీపిందర్ గోయల్, జొమాటో వ్యవస్థాపకుడు

దీపిందర్ గోయల్ ట్వీట్​

దిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్​కతా, గోవా, పుణే, గురుగ్రామ్, వడోదర పట్టణాల్లో జొమాటో, ఈజీడిన్నర్​, నియర్​బై, మ్యాజిక్ పిన్, గౌర్​మెట్​ పాస్​పోర్ట్ వంటి సంస్థలపై 'లాగ్ అవుట్'​ సమ్మె చేస్తున్నాయి పలు రెస్టారెంట్లు.

దీనిపై స్పందిస్తూ.. "రెస్టారెంట్లకు ఏది మేలో.. అదే జొమాటోకు మేలు. వినియోగదారులకు ఏది మంచో అదే జొమాటోకు మంచి. మాతో సహా తమ ఉత్పత్తుల మార్కెట్​పై సరైన నిర్ణయాలు తీసుకోవడం రెస్టారెంట్ల సమస్య" అని గోయల్​ పేర్కొన్నారు.

జాతీయ రెస్టారెంట్ ఆసోసియేషన్ అధ్యక్షుడు రాహుల్ సింగ్​ గత వారం ప్రారంభించిన లాగ్ అవుట్​ సమ్మె.. దేశ వ్యాప్తంగా విస్తరించింది.

ఇదీ చూడండి: ఫస్ట్​ డే ఫస్ట్​ షోతో 'ఇంటి థియేటర్లు' హిట్​!

Last Updated : Sep 27, 2019, 10:12 AM IST

ABOUT THE AUTHOR

...view details