తెలంగాణ

telangana

ఇకపై వాట్సాప్ గ్రూపుల్లో చేర్చడం అంత సులువు కాదు!

By

Published : Oct 22, 2019, 6:31 PM IST

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ముందుకొచ్చే 'వాట్సాప్'.. మరో సరికొత్త అప్​డేట్​ను అందుబాటులోకి తెచ్చింది. అనవసరమైన వాట్సాప్​ గ్రూపుల్లో మిమ్మల్ని చేర్చకుండా ఉండేందుకు వీలుపడే సెట్టింగ్​ను తీసుకువచ్చింది. ప్రస్తుతానికి ఐఎఓఎస్​ వాట్సాప్​, అండ్రాయిడ్ వాట్సాప్​​ బీటా యూజర్లకు మత్రమే ఈ సదుపాయం ఉంది. త్వరలోనే అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

ఇకపై వాట్సాప్ గ్రూపుల్లో చేర్చడం అంత సులువు కాదు!

సంక్షిప్త సందేశాల దిగ్గజం వాట్సాప్ మరో సరికొత్త అప్​డేట్​ను తీసుకువచ్చింది. వాట్సాప్​ గ్రూపునకు సంబంధించి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గోప్యత సెట్టింగ్​ను అందుబాటులోకి తెచ్చింది.

గ్రూప్ ప్రైవసీతో లాభాలేంటి..?

ప్రసుతం ఎవరి దగ్గర మీ ఫోన్​ నెంబర్ ఉన్నా.. వారు మిమ్మల్ని ఏదైనా వాట్సాప్ గ్రూపులో సభ్యులుగా చేర్చొచ్చు. కొన్ని సార్లు గుర్తు తెలియని వ్యక్తులూ.. గ్రూపుల్లో చేర్చడం వీలవతుంది. అయితే కొత్త ఫీచర్​తో ఈ సమస్యకు చెక్​పడనుంది.

తాజా అప్​డేట్​తో గ్రూపులో మిమ్మల్ని ఎవరు చేర్చాలి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. అదెలా అంటే కొత్త అప్​డేట్​ సెట్టింగ్గుల్లో గ్రూప్​ ప్రైవసీ సదుపాయాన్ని తీసుకువచ్చింది వాట్సాప్. ప్రైవసీ సెట్టింగుల్లో.. గ్రూపు అడ్మిన్​పై క్లిక్​ చేసి.. అందులో ఎవిరీవన్​, మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి.

  • ఎవిరీవన్​​ను ఎంపిక చేసుకుంటే.. ఎవరైనా మిమ్మల్ని గ్రూపులో చేర్చెందుకు వీలుంటుంది.
  • మై కాంటాక్ట్స్​ ఎంపిక చేసుకుంటే.. మీ ఫోన్​బుక్​లో నంబర్​ సేవ్ చేసుకున్న వ్యక్తులు తప్ప ఇతరులెవ్వరూ మిమ్మల్ని గ్రూపుల్లో చేర్చడం వీలుకాదు.
  • మై కాంటాక్ట్స్​ ఎక్సెప్ట్​తో.. మీరు నంబర్ సేవ్​ చేసుకున్న వారిలోనూ.. ఎవరు మిమ్మల్ని గ్రూపులో చేర్చాలి.. ఎవరు చేర్చకూడదు అనేది నిర్ణయించొచ్చు.

ఇలా గ్రూపుల్లో మిమ్మల్ని సభ్యులుగా చేర్చడం వీలుకాని అడ్మిన్​లకూ.. ఓ సదుపాయాన్ని తీసుకువచ్చింది వాట్సాప్. ఎవరైతే అడ్మిన్ మిమ్మల్ని గ్రూప్​లో చేర్చలనుకుంటారో.. వారు గ్రూప్​లోకి చేర్చే​ అభ్యర్థన లింక్​ను మీకు వ్యక్తిగతంగా పంపించ వచ్చు. ఆ లింక్ ద్వారా మీరు గ్రూపులోకి చేరాలా, వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు.

ప్రస్తుతం వాట్సాప్ ఐఓఎస్​ 2.19.110.20, వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.19.298 బీటా వెర్షన్ ​యూజర్లకు మత్రమే ఈ కొత్త అప్​డేట్ అందుబాటులో ఉంది. త్వరలోనే అందరు యూజర్లకు ఈ అప్​డేట్ తీసుకురానుంది వాట్సాప్​.

ఇదీ చూడండి: ఇన్ఫోసిస్​కు ఏమైంది..? ఎందుకీ నష్టాలు...?

ABOUT THE AUTHOR

...view details