వాట్సాప్.. స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగం అయిపోయిన యాప్. కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాదు.. వృత్తి జీవితంలోనూ భాగమైపోయింది. అందుకే ఎప్పటికప్పుడు వాట్సాప్ తన ఫీచర్స్‌ను అప్‌డేట్‌చేస్తూ వస్తోంది. ఇప్పటికీ ఈ యాప్ విషయంలో ఒక అసంతృప్తి ఉంది. అదే... మల్టీ డివైజ్ సపోర్ట్ లేకపోవడం. గతేడాదే ఈ ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షించినప్పటికీ ఎందుకో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఇప్పుడు మళ్లీ ఆ సదుపాయాన్ని వాట్సాప్ పరీక్షిస్తోంది. ప్రస్తుతం 2.20.143 ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ కనిపించిదట.
వాట్సాప్ ఒక డివైజ్‌లో వాడుతున్నప్పుడు ఇంకో డివైజ్‌లో వాడలేం. ఒకవేళ అందులో వాడాలంటే ఇంకో దానిలో వాట్సాప్ పనిచేయదు. రెండు చోట్లా వాడాలనుకునేవారు ఈ విషయంలో నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం ఏక కాలంలో ఒకే అకౌంట్ వాడాలంటే ఉన్న ఏకైక ఆప్షన్ వాట్సాప్ వెబ్ మాత్రమే.