ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గింది. ఒక్క నవంబర్ నెలలోనే 3.63 కోట్ల మంది వినియోగదారులు తగ్గడం కారణంగా.. కంపెనీ ప్రస్తుత వినియోగదారుల సంఖ్య 33.63 కోట్లకు చేరినట్లు సమాచారం. అయితే అక్టోబర్‌లో 1.89 లక్షల మంది వినియోగదారులు పెరిగినట్లు అంతకుముందు ఆ కంపెనీ ప్రకటించడం గమనార్హం.
వొడాఫోన్ ఐడియాకు షాక్.. నవంబరులో కోట్ల మంది ఔట్! - వొడఫోన్ ఐడియా వినియోగదారులు
నవంబర్‌లో వొడాఫోన్ ఐడియా వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్'కి సమర్పించిన నవంబర్ నెల నివేదికలో దాదాపు 3.63 కోట్ల మంది వినియోగదారులు తగ్గినట్లు పేర్కొంది.
అక్టోబర్‌లో వొడాఫోన్ ఐడియా మొత్తం వినియోగదారుల సంఖ్య 37.26 కోట్లుగా ఉండాగా.. నవంబర్ ఆ సంఖ్య 33.63 కోట్లకు చేరినట్లు ఆ కంపెనీ ట్రాయ్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. వినియోగదారులు తగ్గడం పట్ల స్పందన తెలియజేసేందుకు వొడాఫోన్ ఐడియా నిరాకరించింది. అయితే, క్రియాశీలంగా లేని వినియోగదారులను తొలగించడం వల్లే ఈ సంఖ్య భారీగా తగ్గినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. క్రియాశీల వినియోగదారులను నమోదు చేసే సమయాన్ని 120 రోజుల నుంచి 90 రోజులకు తగ్గించినందున వినియోగదారుల సంఖ్యలో భారీ కోత పడినట్లయింది.
ఇదీ చూడండి:పాన్-ఆధార్ అనుసంధాన గడువు పొడిగింపు