తెలంగాణ

telangana

ETV Bharat / business

వాట్సాప్​లో​ కొత్త ఫీచర్​.. గ్రూప్​లో చేరడం ఇక మీ ఇష్టం! - బిజినెస్ వార్తుల తెలుగు

గ్రూప్ ప్రైవసీకి కోసం సరికొత్త అప్​డేట్​ తీసుకువచ్చింది వాట్సాప్​. అవసరంలేని, గుర్తుతెలియని గ్రూపుల్లో మిమ్మల్ని చేర్చకుండా కట్టడి చేసే ఫీచర్​ను కొత్త అప్​డేట్​లో పొందుపరిచింది. వాట్సాప్​ను అప్​డేట్​ చేసుకోవడం ద్వారా కొత్త ఫీచర్​ను వినియోగించుకోవచ్చు.

వాట్సాప్​లో కొత్త ఫీచర్​

By

Published : Nov 6, 2019, 7:33 PM IST

Updated : Nov 6, 2019, 11:33 PM IST

సంక్షిప్త సందేశాల దిగ్గజం.. వాట్సాప్​ గ్రూప్​ ప్రైవసీకి సంబంధించి కొత్త అప్​డేట్​ను అందుబాటులోకి తెచ్చింది. తెలియని వ్యక్తులు గ్రూపుల్లో చేర్చే వీలు లేకుండా ఈ అప్​డేట్​ను తీసుకువచ్చినట్లు వాట్సాప్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు వాట్సాప్​ను అప్​డేట్​ చేసుకుని ఈ ఫీచర్​ను వినియోగించుకోవచ్చని​ పేర్కొంది.

వాట్సాప్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెగసస్ స్పైవేర్​ కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ ద్వారా వాట్సాప్ యూజర్ల కార్యకలాపాలను హ్యాకర్లు తెలుసుకోగలుగుతున్నారు.

కొత్త అప్​డేట్ విశేషాలు..

ప్రసుతం ఎవరి దగ్గర మీ ఫోన్​ నెంబర్ ఉన్నా.. వారు మిమ్మల్ని ఏదైనా వాట్సాప్ గ్రూపులో సభ్యులుగా చేర్చొచ్చు. కొన్ని సార్లు గుర్తు తెలియని వ్యక్తులూ.. గ్రూపుల్లో చేర్చడం వీలవుతుంది. అయితే కొత్త ఫీచర్​తో ఈ సమస్యకు చెక్​పడనుంది.

తాజా అప్​డేట్​తో గ్రూపులో మిమ్మల్ని ఎవరు చేర్చాలి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. అదెలా అంటే కొత్త అప్​డేట్​ ప్రైవసీ సెట్టింగుల్లో గ్రూపు అడ్మిన్​పై క్లిక్​ చేసి.. అందులో ఎవిరీవన్​, మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి.

  • ఎవిరీవన్​​ను ఎంపిక చేసుకుంటే.. ఎవరైనా మిమ్మల్ని గ్రూపులో చేర్చేందుకు వీలుంటుంది.
  • మై కాంటాక్ట్స్​ ఎంపిక చేసుకుంటే.. మీ ఫోన్​బుక్​లో నంబర్​ సేవ్ చేసుకున్న వ్యక్తులు తప్ప ఇతరులెవ్వరూ మిమ్మల్ని గ్రూపుల్లో చేర్చడం వీలుకాదు.
  • మై కాంటాక్ట్స్​ ఎక్సెప్ట్​తో.. మీరు నంబర్ సేవ్​ చేసుకున్న వారిలోనూ.. ఎవరు మిమ్మల్ని గ్రూపులో చేర్చాలి.. ఎవరు చేర్చకూడదు అనేది నిర్ణయించొచ్చు.

ఇలా గ్రూపుల్లో మిమ్మల్ని సభ్యులుగా చేర్చడం వీలుకాని అడ్మిన్​లకూ.. ఓ సదుపాయాన్ని తీసుకువచ్చింది వాట్సాప్. ఎవరైతే అడ్మిన్ మిమ్మల్ని గ్రూప్​లో చేర్చాలనుకుంటారో.. వారు గ్రూప్​లోకి చేర్చే​ అభ్యర్థన లింక్​ను మీకు వ్యక్తిగతంగా పంపించవచ్చు. ఆ లింక్ ద్వారా మీరు గ్రూపులోకి చేరాలా, వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు.

ఇదీ చూడండి: నీరవ్ మోదీకి మరోసారి బెయిల్ నిరాకరణ

Last Updated : Nov 6, 2019, 11:33 PM IST

ABOUT THE AUTHOR

...view details