స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల నుంచి తేరుకున్నాయి. కరోనా భయాలతో గత సెషన్లో నష్టాలను నమోదు చేసిన సూచీలు.. నేడు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతుండటం దేశీయంగా సానుకూలతలు పెంచింది. అయితే కరోనా భయాలతో ఇంకా కొన్ని రోజులు మార్కెట్లలో అప్రమత్తత కొనసాగే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 236 పాయింట్ల వృద్ధితో 41,216 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 76 పాయింట్లు బలపడి.. 12,108 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 41,444 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,179 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,172 పాయింట్ల అత్యధిక స్థాయి, 12,099 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.