తెలంగాణ

telangana

ETV Bharat / business

వారాంతపు ఉత్సాహం.. సెన్సెక్స్ 200 పాయింట్లు ప్లస్​ - స్టాక్​ మార్కెట్​ వార్తలు ఈనాడు

వరుస నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు నేడు తేరుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల లాభంతో ట్రేడవుతుండగా. నిఫ్టీ 56 పాయింట్ల వృద్ధితో కొనసాగుతోంది.

STOCK
స్టాక్ మార్కెట్లు

By

Published : Dec 27, 2019, 9:59 AM IST

వారాంతంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జనవరి నెల ఎఫ్​ అండ్​ ఓలు ప్రారంభం కావడం సహా.. హెవీ వెయిట్ షేర్ల కొనుగోళ్లకు సానుకూలత నేటి లాభాలకు కారణంగా తెలుస్తోంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంతో.. ప్రస్తుతం 41,365 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 56 పాయింట్లకు పైగా వృద్ధితో..12,183 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే..

ఎస్​బీఐ, పవర్​గ్రిడ్, భారతీఎయిర్​టెల్​, యాక్సిస్​ బ్యాంక్​, రిలయన్స్, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
టీసీఎస్​, టాటా స్టీల్​, హెచ్​యూఎల్​, ఎన్​టీపీసీ, బజాజ్​ ఆటో, హెచ్​సీఎల్​టెక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఇదీ చూడండి:విమానాల జోరుకు మందగమనం బ్రేకులు

ABOUT THE AUTHOR

...view details