తెలంగాణ

telangana

ETV Bharat / business

అనిశ్చితులున్నా ఇన్ఫీ జోరు.. మార్కెట్లకు లాభాలు - స్టాక్ మార్కెట్ల లాభాలు

ఐటీ, వాహన, బ్యాంకింగ్ రంగ షేర్ల సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు పుంజుకుని తిరిగి.. 39 వేల మార్కును అందుకుంది. నిఫ్టీ 16 పాయింట్లు బలపడింది. అనిశ్చితులున్నా ఇన్ఫోసిస్ 1.16 శాతం బలపడటం గమనార్హం.

లాభాలతో ముగిసి స్టాక్ మార్కెట్లు

By

Published : Oct 23, 2019, 4:08 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు లభాలతో ముగిశాయి. ఐటీ, వాహన, బ్యాంకింగ్ రంగ షేర్లు నేటి లాభాలకు దన్నుగా నిలిచాయి. ఇన్ఫోసిస్ అనిశ్చితుల కారణంగా ఉదయం కాస్త.. ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి సూచీలు. అయితే అంచనాలకు విరుద్ధంగా ఇన్ఫీ షేర్లు లాభాల్లో ట్రేడవడం మదుపరుల్లో సానుకూలతలు పెంచింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 95 పాయింట్లు లాభపడి.. చివరకు 39,059 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 16 పాయింట్లు వృద్ధి చెంది..11,604 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 39,197 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 38,866 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,652 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,554 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

హెచ్​సీఎల్​ టెక్​ 2.93 శాతం, మారుతీ 2.55 శాతం, ఎస్​బీఐ 1.87, హెచ్​డీఎఫ్​సీ 1.35 శాతం, హీరో మోటార్స్ 1.18 శాతం లాభపడ్డాయి. తీవ్ర అనిశ్చితుల నడుమ ఇన్ఫోసిస్ షేర్లు 1.16 శాతం పుంజుకోవడం గమనార్హం.

భారతీ ఎయిర్​టెల్​ అత్యధికంగా 3.59 శాతం నష్టపోయింది. వేదాంత 2.15 శాతం, ఓఎన్​జీసీ 2.15 శాతం, రిలయన్స్ 1.51 శాతం, కోటక్​ బ్యాంకు 1.31 శాతం నష్టాలను నమోదుచేశాయి.

ఇదీ చూడండి: 'కశ్మీర్​లో పెట్టుబడులకు అమెరికా సంస్థల ఆసక్తి'

ABOUT THE AUTHOR

...view details