తెలంగాణ

telangana

ETV Bharat / business

సమస్యలు చెప్పండి.. సలహాలు ఇవ్వండి:ఎస్​బీఐ - సమస్యలు

ఖాతాదారులను ప్రత్యక్షంగా కలుసుకునేందుకు మంగళవారం "మెగా కస్టమర్​ మీట్​" నిర్వహించనున్నట్లు ఎస్​బీఐ తెలిపింది. ఇందులో వినియోగదార్ల సమస్యలపై చర్చించడం సహా సేవల్లో నాణ్యత పెంపుపై వారి సలహాలు తీసుకోనున్నట్లు తెలిపింది.

ఎస్​బీఐ

By

Published : May 25, 2019, 3:23 PM IST

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం ఎస్​బీఐ తమ వినియోగదార్లతో ఓ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

దేశవ్యాప్తంగా 17 ప్రధాన శాఖల ఆధ్వర్యంలో 500 ప్రాంతాల్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది."మెగా కస్టమర్​ మీట్​ " పేరుతో వచ్చే మంగళవారం జరిగే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు లక్ష మంది వినియోగదార్లను కలుసుకోవాలని భావిస్తోంది ఎస్​బీఐ.

ఖాతాదారులు నేరుగా బ్యాంకు సిబ్బందితో వారి సమస్యల గురించి చర్చించవచ్చు. బ్యాంకు సేవలను మెరుగు పరిచేందుకు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు అని ఎస్​బీఐ పేర్కొంది.

సాధారణంగా బ్యాంకులో కలిసినప్పుడు సమస్యల గురించి చర్చించేంత సమయం ఉండకపోవచ్చని, అందుకే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపింది ఎస్​బీఐ.

యోనో యాప్​పై అవగాహన

దేశవ్యాప్తంగా హాజరయ్యే వినియోగదార్లతో బ్యాంకు అధికారిక యాప్​ "యోనో"ను ఎలా ఉపయోగించాలి, దాని వల్ల లాభాలు ఏంటనే అనే అంశాలపై అవగాహన కల్పించనున్నారు బ్యాంకు సిబ్బంది.

ABOUT THE AUTHOR

...view details