ఎస్బీఐ షాక్.. ఎఫ్డీలపై మరోసారి వడ్డీ రేటు తగ్గింపు
ఫిక్స్డ్ డిపాజిట్ వినియోగదారులకు ఎస్బీఐ మరోసారి షాకిచ్చింది. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే ఎఫ్డీలపై వడ్డీ రేట్లు రెండో సారి తగ్గించింది. అన్ని ఎఫ్డీలపై 40 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. తక్షణమే తగ్గిన వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నట్లు తెలిపింది.
ఎస్బీఐ ఎఫ్డీలపై వడ్డీ తగ్గింపు
By
Published : May 27, 2020, 6:01 PM IST
ప్రభుత్వ రంగ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీ) వడ్డీ రేట్లను తగ్గించింది. అన్ని కాలావధి ఎఫ్డీలపై 40 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. తగ్గించిన వడ్డీ రేట్లను బుధవారం (మే 27) నుంచే అమల్లోకి వస్తున్నట్లు ఆ బ్యాంక్ తన వెబ్సైట్లో పేర్కొంది.
దాదాపు నెల రోజుల వ్యవధిలోనే వడ్డీ రేట్లు తగ్గించడం ఇది రెండో సారి కావడం గమనార్హం. చివరి సారిగా మే 12న వడ్డీ రేట్లను తగ్గించింది ఎస్బీఐ.
తాజా వడ్డీ రేట్లు ఇలా..
కాలావధి
వడ్డీ రేటు
7 - 45 రోజులు
2.9 శాతం
46 - 179 రోజులు
3.9 శాతం
180 రోజుల నుంచి ఏడాది
4.4 శాతం
ఏడాది నుంచి 3 ఏళ్లు
5.1 శాతం
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు
5.3 శాతం
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు
5.4 శాతం
సీనియర్ సిటిజన్లకు సవరించిన వడ్డీ రేట్లకు 50 బేసిస్ పాయింట్ల అదనంగా వడ్డీ జమ చేయనున్నారు. అంటే 3 నుంచి 5 ఏళ్ల వరకు డిపాజిట్లపై 5.3 శాతం ఉండగా.. సీనియర్ సిటిజన్లకు 5.8% శాతం చెల్లించనున్నారు.