తెలంగాణ

telangana

ETV Bharat / business

క్యూ4 ఫలితాల్లో తగ్గిన రిలయన్స్​ జోరు.. జియో హవా

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 6,348 కోట్ల నికర లాభాన్ని అర్జించింది. అయితే.. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే సుమారు 38.7 శాతం క్షీణత నమోదైనట్లు సంస్థ ప్రకటించింది. మరోవైపు.. జియో క్యూ4లో 177 శాతం మేర నికరలాభాన్ని ప్రకటించింది.

Reliance Industries' Q4
రిలయన్స్

By

Published : Apr 30, 2020, 7:51 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం సుమారు 38.7 శాతం మేర క్షీణించి రూ.6,348 కోట్లుగా నమోదైంది. విద్యుత్తు, పెట్రోకెమికల్ వ్యాపారాల్లో మందగమనంతో క్యూ4 ఫలితాలపై ప్రభావ పడినట్లు సంస్థ తెలిపింది.

గతేడాది 2019లో జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ రూ.10,362 కోట్ల నికర లాభాన్ని అర్జించింది.

రూ. 53,125 కోట్ల విలువైన రైట్స్ ఇష్యూను కూడా ప్రకటించింది. 1:15 నిష్పత్తిలో ఒక్కో షేరుకు రూ.1,257 ధరతో అందించనున్నట్లు ప్రకటించింది. ఇంత భారీ మొత్తంలో సంస్థ మదుపరులకు షేర్లు అందించడం దేశంలో అతి పెద్దదిగా పేర్కొంది.

జియో ధన్ ధనాధన్

రిలయన్స్ ఇండస్ట్రీస్​కు చెందిన టెలికాం విభాగం జియో.. 2019-20 ఆర్థిక ఏడాది నాలుగో త్రైమాసికంలో భారీ లాభాలు ఆర్జించింది. మార్చితో ముగిసిన క్యూ4లో 177 శాతం వృద్ధితో రూ.2,331 కోట్ల నికర లాభం ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 840 కోట్లుగా ఉంది.

ఇదీ చూడండి: ఇన్ఫోసిస్​ నాలుగో త్రైమాసిక లాభం రూ.4,335 కోట్లు

ABOUT THE AUTHOR

...view details