డిజిటల్ వాలెట్, పేమెంట్ సంస్థలు పేటీఎం పేమెంట్ బ్యాంక్, ఫోన్‌పే ట్విట్టర్ వేదికగా పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. ఎస్ బ్యాంక్ లావాదేవీలపై ఆర్బీఐ పరిమితులు విధించడం ఇందుకు కారణమైంది.
అలా మొదలు...
ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పేకు లావాదేవీల సేవలను ఎస్ బ్యాంక్ అందిస్తోంది. అయితే ఎస్ బ్యాంక్ లావాదేవీలపై పరిమితులు విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫోన్‌పే సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
దీనిపై ఫోన్‌పే ప్రత్యర్థి సంస్థ పేటీఎం ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
"ప్రియమైన ఫోన్‌పే... మిమ్మల్ని పేటీఎం పేమెంట్ బ్యాంక్ యూపీఐలో చేరాలని ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతం చాలా మంది పేటీఎం వాడుతున్నారు. మీ వ్యాపారం సజావుగా కొనసాగించేందుకు, విస్తరించుకునేందుకు ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి.
మీరు త్వరగా కోలుకునేలా చూస్తాం!"
-పేటీఎం ట్వీట్
పేటీఎం ట్వీట్‌కు ఫోన్‌పే దీటుగా స్పందించింది.