తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎయిర్​ఇండియాకు ఇంధన సరఫరా పునరుద్ధరణ - ఏటీఎఫ్

ఎయిర్​ఇండియాకు చమురు సంస్థలు భారీ ఊరటనిచ్చాయి . ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో ఎయిర్​ఇండియా విమానాలకు ఇంధనం సరఫరా చేసేందుకు అంగీకరించాయి.

ఎయిర్​ఇండియా

By

Published : Sep 8, 2019, 7:10 AM IST

Updated : Sep 29, 2019, 8:33 PM IST

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎయిర్​ఇండియాకు ఇంధన సరఫరాను పునరుద్ధరించాయి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు. ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో విమానయాన సంస్థ, చమురు కంపెనీల మధ్య సానుకూల చర్చలు జరగడమే ఇందుకు కారణం. చమురు సంస్థలకు బకాయి ఉన్న మొత్తం రూ. 4,300 కోట్లలో నెలకు రూ.100 కోట్ల చొప్పున.. చెల్లించేందుకు ఎయిర్ ఇండియా అంగీకరించిందని అధికారిక వర్గాలుఇటీవలే వెల్లడించాయి.

ఇంధన బకాయిలు చెల్లించని కారణంగా గత నెల.. ఆరు విమానాశ్రయాల్లో ఎయిర్​ఇండియాకుచమురు సంస్థలుఇంధన సరఫరా నిలిపివేశాయి. ఇంధన సరఫరా నిలిచిన విమానాశ్రయాల్లో వైజాగ్​, పుణె, కొచ్చిన్, పట్నా, రాంచీ, మొహాలీ ఉన్నాయి.

అధికారిక గణాంకాల ప్రకారం ఎయిర్​ఇండియాకు మొత్తం రూ.58,000 కోట్లకు పైగా రుణభారం ఉంది.

ఇదీ చూడండి: రూ.100 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన

Last Updated : Sep 29, 2019, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details